రోమ్యాన్స్ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రిన్స్, డింపుల్, మానస , ప్రభాక్, నల్లవేణు, సాయి, భారవి, వెంకీ, విష్ణుప్రియ, సాయికృష్ణ, బిందు, అవినాష్, జాహ్నవి తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-మాటలు- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డార్లింగ్ స్వామి నిర్వహించారు మరియు నిర్మాత నిర్మాతలు: జి.శ్రీనివాసరావు, ఎస్.కె. ఎన్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు.
కథ
'రొమాన్స్ చేయడానికి అమ్మాయి, ప్రాణం తీయడానికి గన్ ఉంటే ప్రపంచాన్ని గెలవొచ్చు' అనే డైలాగుతో ప్రారంభమైన ఈ చిత్రంలో ....కృష్ణ(ప్రిన్స్) కు తను ప్రేమించి,జీవితం పంచుకునే అమ్మాయి ఫెరఫెక్ట్ గా ...(అంటే ఇంతకు ముందు ఏ అనుభవం లేని ...)కావాలనేది కోరిక. అందుకోసం ఓ అమ్మాయిని ప్రేమించి తర్వాత ఫెరఫెక్ట్ అవునా కాదా అన్నది టెస్ట్ పెట్టి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా అతనికి.... అనూరాధ(డింపుల్) పరిచయమవుతుంది. ఆమెను మెల్లిగా ప్రేమలో దింపి... పడకమీదకు తీసుకెళ్లి టెస్ట్ పెడతాడు. ఆమె టెమ్ట్ అయ్యి అతనికి లొంగితే...ఆమెతో ప్రేమ వద్దనుకుందామని అతని ఆలోచన. అయితే ఆ ప్లాన్ రివర్స్ అవుతుంది. ఆమె..అతన్ని ఛీ కొట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన ప్రేమను కృష్ణ ఎలా గెలుచుకున్నాడు...ఆ ప్రాసెస్ లో అనూరాధ ఏం టెస్ట్ లు కృష్ణకు పెట్టింది..మిగతాది తెరపైనే చూడాల్సిందే.