అసలే వేసవి కాలం ప్రారంభమవుతుండడం యువ హీరోలా హీరోల సినిమాలు థీయేటర్ల వైపు క్యూ కట్టనున్నాయి. వేసవి వస్తుందంటే చాలు మూవీ మేకర్స్ వారి సినిమాలు రిలీజ్ చేయటానికి సిద్ధంగా వుంటారు అలాగే సినీ ప్రేక్షకులు కూడా వేసవి లో వచ్చే మూవీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. సెలవుల సీజన్లలోనే బాక్సాఫీస్ బరిలో నిలిపేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వేసవి సెలవులు సాధారణంగా స్టార్ హీరోల దృష్టి ఎప్పుడూ ఉంటుంది. ఈ వేసవి లో యువ స్టార్లు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే పలు సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు మేకర్స్. మరీ ఈ వేసవి లో ఏ ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయో తెలుసుకుందామా.