రఫ్ సినిమా ఒక యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టెనర్ చిత్రం ఇందులో ఆది, రకుల్ ప్రీతి సింగ్, శ్రీహరి, మరియు బ్రహ్మనందం, యమ్ యస్ నారాయణ, రఘుబాబు, వీళ్ళందరు ముఖ్య పాత్రాలలో నటిస్తున్నారు. దర్సకత్వం సి యచ్ సుబ్బారెడ్డి నిర్వహిస్తున్నారు, నిర్మాత యమ్ అభిలాష్ నిర్మిస్తున్నారు. సంగీతదర్సకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చుతున్నారు.
కథ
కథలోకి వెళితే...చందు (ఆది)కు ప్రేమంటే చాలా నమ్మకం. కడుపు చేసి మోసం చెయ్యడం కాదు పెళ్లి చేసుకొని కలకాలం జీవించడం అని నమ్మే వ్యక్తి. అలాంటి చందు నందిని(రకుల్ ప్రీత్ సింగ్) ప్రేమలో పడతాను. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. చందు అనాద. పెళ్లి ఎలాగైనా నందిని ఇంట్లో వాళ్లని ఒప్పించి చేసుకోవాలనుకుంటాడు. అందుకే తన ప్రేమ గురించి ముందు నందిని కంటే, తన అన్నయ్య అయిన సిద్దార్థ్(శ్రీ హరి)కి ముందు చెప్పి ఒప్పించాలనుకుంటాడు. ఈ క్రమంలో చందు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.