రొటీన్ లవ్‌స్టోరీ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, రెజీనా, వెన్నెల కిషోర్, చంద్రమోహన్, హేమ, కృష్ణుడు, జయప్రకాష్‌రెడ్డి, ఝాన్సీ, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు నిర్వహించారు మరియు నిర్మాత చాణిక్య భూనేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చారు.
కథ
సంజూ (సందీప్ కిషన్) చాలా సరదాగా జీవితం ఎంజాయ్ చేస్తున్న ఫస్ట్ ఇయిర్ ఇంజినీరింగ్ స్టూడెంట్. అతను ఆ వయస్సులో అందరిలాగే తన క్లాస్ మేట్ తన్వి (రెజీనా) ప్రేమలో పడతాడు. మొదటి వీరిద్దరూ మంచి స్నేహితుల్లా కొంత కాలం సరదాగా గడుపుతారు. అ తర్వాత ఓ రోజు సంజూ ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ఆమె తనకు కొంత సమయం కావాలని,ఇద్దరం మరింతగా అర్దం చేసుకోవటానికి ఆ సమయం ఉపయోగిస్తుందని అంటుంది. ఇద్దరిలోనూ పాజిటివ్,నెగిటివ్ లు ఉంటాయి. దాంతో ఆరిలేషన్ షిప్ లో వీరిద్దరూ దగ్గరయ్యారా..లేక వేరు వేరు భావాలతో విడిపోయారా అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.