రౌడీ సినిమా యాక్షన్ డ్రామా చిత్రం ఇందులో మోహన్ బాబు, మంచు విష్ణు, శాన్వి, జయసుధ, తణికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ నిర్వహించారు మరియు 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ, ఎవి పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు: పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు.
కథ
అన్న (మోహన్ బాబు) రాయల సీమలో సమాంతర ప్రభుత్వం నడుపుతున్న ఓ లీడర్...పెద్ద దిక్కు. ఆ ప్రాంతంలో తన చెప్పిదే చట్టం..తన మాటే వేదవాక్కు. పొలిటికల్ లీడర్స్, అఫిషియల్స్ ఎందరో ఆయన పనులు చేసి పెడుతూంటారు. అక్కడ జనం చేత దేముడిలా పూజింపబడే ఆయనకు ఇంట్లోనే సమస్య ఎదురౌతుంది. తన ఆశయానికి,ఆకాంక్షలకు ఆయన పెద్ద కొడుకు(భూషణ్) అడ్డం తగులుతూంటాడు. దీన్ని గుర్తించిన అయితే ఆయన శతృవులు(వేదాంతం మూర్తి, జీవా) భూషన్ ని ప్రయోగించి ఆయన్ని దెబ్బ కొట్టాలనుకుంటారు. ఆ సమయంలో చిన్న కొడుకు కృష్ణ (మంచు విష్ణు) పరిస్దితులని చేతులోకి తీసుకుని వారి ప్లాన్ లను ఎలా తిప్పి కొట్టాడు..అన్న సామ్రాజ్యానికి అసలైన వారసుడుగా ఎలా ఎదిగాడు అనేది మిగతా కథ.