సాహసం స్టోరి

  సాహసం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్‌, తాప్సి, శక్తికపూర్‌, అలీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్రశేఖర్‌ యేలేటి నిర్వహించారు మరియు నిర్మాత: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీ స్వరాలు సమకుర్చారు. 

  కథ

  గౌతమ్‌ వర్మ (గోపీచంద్‌) ఓ సెక్యురిటీ గార్డ్‌. జీతం తక్కువ. కానీ ఖరీదైన కలలు కంటుంటాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని ఆశ. లాటరీలు కొనడం హాబీ. అనుకోకుండా ఓసారి తన పూర్వీకుల గురించి తెలుస్తుంది. వాళ్లకు సంబంధించిన ఆస్తులు పాకిస్ధాన్ లో ఉన్న ఓ పురాతన దేవాలయం( హింగ్లాజ్ దేవి) సొరంగ మార్గం లోపల నిక్షిప్తమై ఉంటాయి. అయితే అక్కడ ఉన్న నిథి కోసం..అప్పటికే... పాకిస్దాన్ లో ఓ గ్రూప్ (శక్తి కపూర్) తీవ్రంగా ప్రయత్నిస్తూంటుంది. ఆ దేవాలయం దగ్గరకు వెళ్లిన గౌతమ్.. ఆ నిధిని ఎలా బయిటపెట్టాడు...విలన్స్ నుంచి ఎలా ఆ నిధిని రక్షించాడు.. అతనికి శ్రీనిధి (తాప్సి) ఎలా పరిచయం అయ్యింది...ఆమెతో ఉన్న రిలేషన్ ఏమిటి అనేది మిగతా కథ.
  **Note:Hey! Would you like to share the story of the movie సాహసం with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X