సలీమ్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విష్ణువర్ధన్ బాబు, ఇలియానా, మోహన్ బాబు, కావేరీ ఝా, వెంకట్, నెపోలియన్, గిరిబాబు, అలీ, జయప్రకాష్ రెడ్డి, ప్రగతి, హేమ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వైవీఎస్ చౌదరి నిర్వహించారు మరియు నిర్మాత మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సందీప్ చౌతా స్వరాలు సమకుర్చరు.
కథ
యూరప్ నుంచి లాంగ్ గ్యాప్ లో స్వదేశానికి వస్తున్న సత్య(ఇలియానా)ని ఫ్యామలీ రైవల్స్ నుంచి మున్నా(విష్ణు) కాపాడతాడు.దాంతో నిన్నే పెళ్లాడతా తరహాలో ఉన్న ఆమె కుటుంబం మున్నాని తమ ఇంటిలో పెట్టుకుంటుంది. రెగ్యులర్ గానే సత్యతో మున్నా లవ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. మొదటి ఒప్పుకోకున్నా ఆ తర్వాత ఆమె ప్రేమలో పడి అతని వెంటబడుతుంది. అలా కొన్ని రీళ్ళు పాటలు,ఫైట్స్ అయ్యాక మున్నాతో ఆమె ఇంట్లో వాళ్ళు పెళ్ళి నిర్ణయిస్తారు. ఆ సమయంలోనే ఆమె తన బోయ్ ప్రెండ్ క్రిష్ (వెంకట్)ని ఇండియా రప్పించుకుని జంప్ అయిపోతుంది. ఇంతకీ హఠాత్తుగా ఊడిపడ్డ క్రిష్ ఎవరూ అంటే అతను యూరప్ లో ఉన్న ఓజో(మోహన్ బాబు)అనే పెద్ద డాన్ తమ్ముడు. ఇలాంటి క్రిటికల్ సిట్యువేషన్ లో మున్నా ఏం చేసాడు..సత్యను తిరిగి తన వైపుకు తిప్పుకుని ఇండియా ఎలా తెచ్చాడనేది మిగతా కథ.