సామజ వరగమన సినిమా రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ అబ్బరాజు వహించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు. ఏ.కే ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
కథ
ఉమా మహేశ్వర్ రావు (వీకే నరేష్) 25 ఏళ్లుగా డిగ్రీ పాస్ కావడానికి కష్టాలు పడుతుంటాడు. ఉమా మహేశ్వర్ రావు కొడుకు బాక్సాఫీస్ బాలు అలియాస్ బాలు (శ్రీ విష్ణు) ఏషియన్ మల్టీప్లెక్స్ థియేటర్‌లో టికెట్లు అమ్మే ఉద్యోగం చేస్తుంటాడు. తండ్రి ఉమా మహేశ్వర్ రావును ఎలాగైనా డిగ్రీ పాస్ చేయించాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తుంటాడు. ఇదిలా ఉండగా తనను ఇష్టపడే ప్రతీ అమ్మాయితో రాఖీ కట్టించుకొనే బాలు.. సరయు (రెబా మోనిక జాన్) చూసి ప్రేమలో పడుతాడు. బాలు, సరయు ప్రేమకు ఉమా మహేశ్వర్ రావు కుటుంబం ఆమోదం తెలుపుతుంది. కానీ వారి పెళ్లికి ఓ భారీ సమస్య వచ్చి పడుతుంది. ఉమా మహేశ్వర్ రావు 25 ఏళ్లుగా డిగ్రీ పాస్ కావడానికి ఎందుకు కష్టపడుతున్నాడు? తండ్రిని డిగ్రీ పాస్ చేయించడానికి బాలు చేసే ప్రయత్నం వెనుక కథ ఏమిటి? అమ్మాయిలందరితో రాఖీ కట్టించుకొనే బాలు.. సరయును ఇష్టపడటానికి కారణం ఏమిటి? బాలు, సరయు ప్రేమ కథలో చోటు చేసుకొన్న సమస్య ఏమిటి? కొడుకు పెళ్లి చేయడానికి ఉమా మహేశ్వర్ రావు చేసిన ప్రయత్నాలు ఎలా సాగాయి? బాలు ప్రేమ కథకు రాధాకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్), కులశేఖర్ (వెన్నెల కిషోర్)కు సంబంధమేమిటి? చివరకు ఉమా మహేశ్వర్ రావు డిగ్రీ పాస్ అయ్యాడా? బాలు, సరయు పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే సామజవరగమన సినిమా.
రిలీజ్ డేట్
ఈ చిత్రం ఈ నెల 29న విడుదల అయ్యింది.
స్టోరీ లైన్
అమ్మాయిల పట్ల విరక్తి పెంచుకునే ఓ మధ్యతరగతి కుర్రాడు బాలు. అయితే రిచ్ లైఫ్‌స్టైల్ కోరుకునే ఓ అమ్మాయి అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ