X
తెలుగు » సినిమాలు » సామజ వరగమన
సామజ వరగమన

సామజ వరగమన

Comedy | Drama | 29 Jun 2023 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

సామజ వరగమన స్టోరీ

సామజ వరగమన సినిమా రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం  రామ్‌ అబ్బరాజు వహించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు.  ఏ.కే ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.  కథ ఉమా మహేశ్వర్ రావు (వీకే నరేష్) 25 ఏళ్లుగా డిగ్రీ పాస్ కావడానికి కష్టాలు పడుతుంటాడు. ఉమా మహేశ్వర్ రావు కొడుకు బాక్సాఫీస్ బాలు అలియాస్ బాలు (శ్రీ విష్ణు) ఏషియన్ మల్టీ‌ప్లెక్స్ థియేటర్‌లో టికెట్లు అమ్మే ఉద్యోగం చేస్తుంటాడు. తండ్రి ఉమా మహేశ్వర్ రావు‌ను ఎలాగైనా డిగ్రీ పాస్ చేయించాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తుంటాడు. ఇదిలా ఉండగా తనను ఇష్టపడే ప్రతీ అమ్మాయితో రాఖీ కట్టించుకొనే బాలు.. సరయు (రెబా మోనిక జాన్) చూసి ప్రేమలో పడుతాడు. బాలు, సరయు ప్రేమకు ఉమా మహేశ్వర్ రావు కుటుంబం ఆమోదం తెలుపుతుంది. కానీ వారి పెళ్లికి ఓ భారీ సమస్య వచ్చి పడుతుంది. ఉమా మహేశ్వర్ రావు 25 ఏళ్లుగా డిగ్రీ పాస్ కావడానికి ఎందుకు కష్టపడుతున్నాడు? తండ్రిని డిగ్రీ పాస్ చేయించడానికి బాలు చేసే ప్రయత్నం వెనుక కథ ఏమిటి? అమ్మాయిలందరితో రాఖీ కట్టించుకొనే బాలు.. సరయును ఇష్టపడటానికి కారణం ఏమిటి? బాలు, సరయు ప్రేమ కథలో చోటు చేసుకొన్న సమస్య ఏమిటి? కొడుకు పెళ్లి చేయడానికి ఉమా మహేశ్వర్ రావు చేసిన ప్రయత్నాలు ఎలా సాగాయి? బాలు ప్రేమ కథకు రాధాకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్), కులశేఖర్ (వెన్నెల కిషోర్)కు సంబంధమేమిటి? చివరకు ఉమా మహేశ్వర్ రావు డిగ్రీ పాస్ అయ్యాడా? బాలు, సరయు పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే సామజవరగమన సినిమా.  రిలీజ్ డేట్   ఈ చిత్రం ఈ నెల 29న విడుదల అయ్యింది.  స్టోరీ లైన్  అమ్మాయిల పట్ల విరక్తి పెంచుకునే ఓ మధ్యతరగతి కుర్రాడు బాలు. అయితే రిచ్‌ లైఫ్‌స్టైల్‌ కోరుకునే ఓ అమ్మాయి అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ
Read More

సామజ వరగమన కాస్ట్ & క్రూ

సామజ వరగమన సిబ్బంది సమాచారం

దర్శకత్వం రామ్ అబ్బరాజు
స్టోరీ భాను భోగవరపు
డైలాగ్ నందు సవిరిగిన
సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి
సంపాదకుడు చోట కె ప్రసాద్
సంగీతం గోపి సుందర్, శ్రీ మణి
నిర్మాత రాజేష్ దొంద
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సామజ వరగమన విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కుల, మతాలకు అతీంగా ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్ లాంటి బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన క్లీన్ అండ్ ఫెయిర్ ఎంటర్‌టైనర్ సామజవరగమన. వీకే నరేష్, శ్రీ విష్ణు నటన, కామెడీ ట్రాక్ ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. దర్శకుడు రామ్ అబ్బూరి దట్టించిన వినోదం కడుపుబ్బ నవ్విస్తుంది. రెండు గంటలపాటు మంచి వినోదాన్ని ఆస్వాదించే సినిమా ఇది. ఎలాంటి అనుమానాలు లేకుండా థియేటర్‌కు వెళితే వినోదాన్ని భారీగా నింపుకొన్న హృదయంతో బయటకు వస్తారు. గతంలో జంధ్యాల, ఈవీవీ, రేలంగి నరసింహరావు తరహా సినిమాలను గుర్తు చేస్తుంది. మస్ట్ వాచ్ సామజవరగమన.

సామజ వరగమన ట్రైలర్

Video Thumbnail

సామజ వరగమన సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సామజ వరగమన

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+