సరదాగా కాసేపు స్టోరి

  సరదాగా కాసేపు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, అవసరాల శ్రీనివాస్, మధురిమ, ఆహుతి ప్రసాద్, ఎమ్.ఎస్.నారాయణ, సనా, కృష్ణభగవాన్, జీవా, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు అందించారు.

  కథ

  అఅమెరికా నుంచి వచ్చిన శ్రీను(అవసరాల శ్రీనివాస్)కి మణిమాల(మధురిమ)తో పెళ్ళిచూపులు. అయితే శ్రీనుకి ఓ తింగరి కోరిక ఉంటుంది. తానెవరో తెలియకుండా తను కట్టుకోబోయే అమ్మాయి ఇంట్లో ఓ పదిరోజులు ఉండి ఆమె ప్రవర్తనని దగ్గరనుంచి పరిశీలించి పెళ్ళిచేసుకోవాలని(అయితే ఒక్కటీ అలాంటి సీన్ మొహమాటానికి కూడా ఎక్కడా కనపడదు). ఈ కోరిక తీర్చుకోవటం ఓ విచిత్రమైన ఆలోచన చేస్తాడు. తన కారు డ్రైవర్ రంగబాబు(అల్లరి నరేష్) ని పెళ్ళి కొడుకులాగ, తానేమో డ్రైవర్ లాగ గెటప్స్ ఛేంజ్ చేసుకుని ఆ ఇంట్లో ప్రవేశిద్దామని. ఇక ఈ మనుష్యుల మార్పిడి విషయం తెలుసుకున్న శ్రీను తల్లి తండ్రులు...పెళ్ళి కూతురు కుటుంబానికి ఈ విషయం తెలియబరుస్తారు. అయితే ఈ లోగా మరో ట్విస్ట్. పెళ్ళి కూతురు ఇంటికి వెళ్ళకముందే శ్రీనుబుద్ది మారి...ఈ తింగరి ప్లాన్ ని వదిలేసి... ఎవరిలాగే వాళ్ళే ఉందామనుకుంటాడు. అయితే ఈ విషయం తెలియని మణిమాల ఇంట్లో వాళ్ళు అసలు పెళ్ళి కొడుకు శ్రీనుని డ్రైవర్ అనుకుని, డ్రైవర్ ..రంగబాబుని పెళ్ళి కొడుకు అనుకుని రివర్స్ లో ట్రీట్ చేస్తూంటారు. ఈ క్రమంలో డ్రైవర్ రంగబాబు..పెళ్ళి కూతురుతో ప్రేమలో పడతాడు. అది అర్దమైన శ్రీను ఈ ప్రేమని చెడకొట్టి...తాను అసలు పెళ్ళికొడుకుని అని చెప్దామనుకుంటాడు. ఇలా గందరగోళంగా మారిన ఈ సిట్యువేషన్ నుంచి వీళ్ళిద్దరూ ఎలా బయిటపడ్డారు..మణిమాల ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది ఓపిక, ఆసక్తి ఉంటే చూడదగ్గ మిగతా కథ.
  **Note:Hey! Would you like to share the story of the movie సరదాగా కాసేపు with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X