X
తెలుగు » సినిమాలు » సరదాగా కాసేపు
సరదాగా కాసేపు

సరదాగా కాసేపు

Comedy | 17 Sep 2010 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సరదాగా కాసేపు స్టోరీ

సరదాగా కాసేపు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, అవసరాల శ్రీనివాస్, మధురిమ, ఆహుతి ప్రసాద్, ఎమ్.ఎస్.నారాయణ, సనా, కృష్ణభగవాన్, జీవా, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు అందించారు. కథ అఅమెరికా నుంచి వచ్చిన శ్రీను(అవసరాల శ్రీనివాస్)కి మణిమాల(మధురిమ)తో పెళ్ళిచూపులు. అయితే శ్రీనుకి ఓ తింగరి కోరిక ఉంటుంది. తానెవరో తెలియకుండా తను కట్టుకోబోయే అమ్మాయి ఇంట్లో ఓ పదిరోజులు ఉండి ఆమె ప్రవర్తనని దగ్గరనుంచి పరిశీలించి పెళ్ళిచేసుకోవాలని(అయితే ఒక్కటీ అలాంటి సీన్ మొహమాటానికి కూడా ఎక్కడా కనపడదు). ఈ కోరిక తీర్చుకోవటం ఓ విచిత్రమైన ఆలోచన చేస్తాడు. తన కారు డ్రైవర్ రంగబాబు(అల్లరి నరేష్) ని పెళ్ళి కొడుకులాగ, తానేమో డ్రైవర్ లాగ గెటప్స్ ఛేంజ్ చేసుకుని ఆ ఇంట్లో ప్రవేశిద్దామని. ఇక ఈ మనుష్యుల మార్పిడి విషయం తెలుసుకున్న శ్రీను తల్లి తండ్రులు...పెళ్ళి కూతురు కుటుంబానికి ఈ విషయం తెలియబరుస్తారు. అయితే ఈ లోగా మరో ట్విస్ట్. పెళ్ళి కూతురు ఇంటికి వెళ్ళకముందే శ్రీనుబుద్ది మారి...ఈ తింగరి ప్లాన్ ని వదిలేసి... ఎవరిలాగే వాళ్ళే ఉందామనుకుంటాడు. అయితే ఈ విషయం తెలియని మణిమాల ఇంట్లో వాళ్ళు అసలు పెళ్ళి కొడుకు శ్రీనుని డ్రైవర్ అనుకుని, డ్రైవర్ ..రంగబాబుని పెళ్ళి కొడుకు అనుకుని రివర్స్ లో ట్రీట్ చేస్తూంటారు. ఈ క్రమంలో డ్రైవర్ రంగబాబు..పెళ్ళి కూతురుతో ప్రేమలో పడతాడు. అది అర్దమైన శ్రీను ఈ ప్రేమని చెడకొట్టి...తాను అసలు పెళ్ళికొడుకుని అని చెప్దామనుకుంటాడు. ఇలా గందరగోళంగా మారిన ఈ సిట్యువేషన్ నుంచి వీళ్ళిద్దరూ ఎలా బయిటపడ్డారు..మణిమాల ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది ఓపిక, ఆసక్తి ఉంటే చూడదగ్గ మిగతా కథ.
Read More

సరదాగా కాసేపు కాస్ట్ & క్రూ

సరదాగా కాసేపు సిబ్బంది సమాచారం

దర్శకత్వం వంశీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చక్రి
నిర్మాత ఎమ్ ఎల్ కుమార్ చౌదరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సరదాగా కాసేపు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏదైమైనా ఈ సినిమా సరదాగా కాసేపు..మనల్ని చాలాసేపు విసిగిస్తుందనటంలో సందేహం లేదు. అప్పటికీ వంశీ సినిమా కామిడీ గ్యారెంటీ అని ముచ్చటపడితే వాళ్ళ అదృష్టం. ఇక ఈ సినిమాలో ఓ కమిడెయన్ ప్రారంభంనుంచీ చివరదాకా ఓ బ్యాగ్ చూపెడుతూ...దీని జిప్ తీసి చూపెడతా..జిప్ తీస్తా అని బెదిరిస్తూ తిరుగుతూంటారు. ఇంతకూ ఆ బ్యాగ్ లో ఏముంది అని ఫైనల్ గా రివిల్ చేస్తే అందులో శుభం కార్డు ఉంటుంది. ఇక నాకయితే ఆ కార్డు వాడిదగ్గర ఉందని ముందే తెలిస్తే ఎలోగోలా బ్రతిమాలి ఇంటర్వెల్ బదులు ఆ కార్డు వేయించుకుని బ్రతికిపోదును కదా అనిపించింది.

సరదాగా కాసేపు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సరదాగా కాసేపు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+