సీమ శాస్త్రి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, ఫర్జానా, జయప్రకాష్ రెడ్డి, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ఎల్ బి శ్రీరామ్, ముమైత్ ఖాన్, కోవై సరళ, రఘుబాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం-జి నాగేశ్వర్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత చావలి రామాంజనేయులు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమాతరమ్ శ్రీనివాస్ స్వరాలు సమకుర్చారు.
కథ
సీమ ఫ్యాక్షనిజం ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంది. నిర్మాతల జేబులు నింపుతూనే ఉంది. తాజాగా విడుదలైన సీమశాస్త్రి సినిమా కూడా ఫ్యాక్షనిజం నేపథ్యంలోనే నిర్మితమయింది. ఇక ఫ్యాక్షన్ చిత్రాలు చాలు అన్నట్టుగా ఈ ఫ్యాక్షన్ చిత్రం సాగుతుంది. అంటే వినోదాత్మకంగా సాగుతుందన్నమాట. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా పూర్తిగా కామెడీ ట్రాక్ మీదే సాగుతుంది. సుబ్రమణ్య శాస్త్రి (అల్లరి నరేష్), సురేఖా రెడ్డి(ఫర్జానా) ప్రేమలో పడతాడు. ప్రేమలో పడ్డప్పుడు సురేఖా రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలియదు. ప్రేమ ముదిరిన తరువాత సుబ్రమణ్య శాస్త్రికి తెలుస్తుంది సురేఖా రెడ్డి ఫ్యామిలీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని. శాస్త్రి గారు కూడా ఫ్యాక్షన్ తరహాలోనే వెళ్లి సురేఖా రెడ్డి తల్లి దండ్రులను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. వినోదాత్మకంగా తన ఫ్రేమను ఎలా గేలుచుకుంటాడు అనేది మిగతా కథా...