X
సెంబి
Drama | 03 Feb 2023 |
Telugu

సెంబి స్టోరీ

సెంబి మూవీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అశ్విన్ కుమార్, కొవై సరళ, జీవం, అజ్మల్ ఖాన్, రియా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రభు సోలమన్ వహించారు. నిర్మాత రవీంద్రన్ నిర్మించారు. సంగీతం నివాస్ కె ప్రసన్న అందించారు.
కథ 
వీరమ్మతల్లి (కోవై సరళ) తన పదేళ్ల మనవరాలు సెంబీతో (బేబీ నిలా) కలిసి అటవీ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. అటవీ ప్రాంతంలో దొరికే తేనే, పక్షుల గుడ్లు, పుట్ట గొడుగులు సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. తను ఎంతో ప్రేమగా చూసుకునే మనవరాలు సెంబీని రాజకీయ నాయకుడి కొడుకు అతని ఇద్దరి ఫ్రెండ్స్ కలిసి క్రూరంగా గ్యాంగ్ రేప్ చేస్తారు. దీంతో వీరమ్మతల్లి పోలీసులను ఆశ్రయిస్తుంది. కానీ విచారణ చేపట్టిన ఎస్సై అమ్ముడుపోవడాన్ని సహించలేని ఆ బామ్మ అతన్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. దీంతో వీరమ్మ తల్లి వెంట పోలీసులు, ఆ రాజకీయ నాయకులు పడతారు. మరి వీరమ్మ తల్లి తన మనవరాలి ప్రాణాలు ఎలా కాపాడుకుంది? ఆమెకు సహాయంగా ఎవరు నిలిచారు? ఈ సంఘటనపై రాజకీయం, ప్రజల భావాలు ఎలా ఉంటాయి? వీరమ్మ తల్లికి అన్ని సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నా కోర్టు ఎలాంటి ఆధారాన్ని పరిగణలోకి తీసుకుంది? అసలు సెంబీకి న్యాయం జరిగిందా? వంటి ఆసక్తిరక అంశాలు ఏంటో తెలుసుకోవాలంటే సెంబీని వీక్షించాల్సిందే. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+