సికిందర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య, సమంత, విద్యుత్ జమాల్, బ్రహ్మానందం, మనోజ్‌బాజ్‌పాయ్, మురళీశర్మ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లింగుస్వామి నిర్వహించారు మరియు నిర్మాతలు లగడపాటి శిరీష, శ్రీధర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజు స్వరాలు సమకుర్చారు.
కథ
మాఫియా డాన్ రాజు భాయ్(సూర్య)ని వెతుక్కుంటా అతని తమ్ముడు కృష్ణ(సూర్య) వైజాగ్ నుంచి ముంబైకు వస్తాడు. అతన్ని అన్వేషించే క్రమంలో రాజు భాయ్...ముంబైలో మాఫియాని శాసించిన జీవితం. ప్రాణ స్నేహితుడు చందు(విద్యుల్ జమాల్) తో ఉన్న అనుభంధం,కమీషినర్ కుమార్తె సమంతతో ప్రేమయాణం వంటివి తెలుస్తాయి. అంతేకాదు రాజు భాయ్, చందు కలిసి ...ఇమ్రాన్(మనోజ్ బాప్ పేయ్) అనే మరో పెద్ద మాఫియా డాన్ చేతిలో చనిపోయాడని తెలుస్తోంది. ఈ లోగా రాజు భాయ్ సోదరుడు వచ్చి అతని గురించి ఎక్వైరీ చేస్తున్నాడని తెలుసుకున్న రాజుభాయ్ శత్రువులు అతన్ని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తారు.ఈ లోగా ఓ ట్విస్ట్ వచ్చి కథని మలుపు తిప్పుతుంది. ఏమిటా ట్విస్ట్... తన అన్నని చంపిన వారిపై కృష్ణ పగ తీర్చుకున్నాడా...సమంత...లవ్ స్టోరీ ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.