సిల్లీ ఫెలోస్ (2018)(U)
Release date
07 Sep 2018
genre
సిల్లీ ఫెలోస్ స్టోరి
సిల్లీ ఫెలోస్ సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునిల్, అల్లరి నరేష్, పూర్ణ, చిత్ర శుక్ల, జయప్రకాష్ రెడ్డి, ఝాన్సి, పోసాని కృష్ణ మురళి, రఘు కురుమంచి, చలపతి రావు, రాజా రవింద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బీమినేని శ్రీనివాస రావు మరియు నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ వసంత్ అందించారు.
కథ
రాజకీయ వేత్త అయిన జాకెట్ జానకి రాం (జయప్రకాశ్‌రెడ్డి) కులాంతర వివాహాలు చేయిస్తుంటాడు. వీరబాబు (అల్లరి నరేష్) బలవంతం చేసి ఒప్పించడంతో పుష్ప (నందిని) అనే రికార్డింగ్ డ్యాన్సర్‌ను సురిబాబు (సునీల్) పెళ్లి చేసుకొంటాడు. కానీ అప్పటికే కృష్ణవేణి (పూర్ణ)తో ప్రేమలో ఉండటంతో వెంటనే విడాకులు తీసుకోవాలని అనుకొంటాడు. కథ ఇలా సాగుతుంటే ఎస్పై ఉద్యోగంలో చేరాలనే కోరికతో ఉన్న వాసంతి (చిత్ర శుక్ల)తో ప్రేమలో పడుతాడు. జాకెట్ జానకి రాంకు ఓ మినిస్టర్ చనిపోతూ తను దాచిన 500 కోట్ల గురించి చెబుతాడు. ఆ విషయం తెలిసిన జాకెట్ ప్రత్యర్థులు (రాజారవీంద్ర, పోసాని కృష్ణమురళీ) ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ పుష్ఫకు విడాకులు ఇవ్వాలనుకొన్న సురిబాబు ప్రయత్నం నెరవేరింది. కృష్ణవేణితో సురిబాబు పెళ్లి జరిగిందా? వాసంతి ఇన్స్పెక్టర్ అయిందా? వాసంతి, వీరబాబు ప్రేమ కొలిక్కి వచ్చిందా? 500 కోట్ల రూపాయల ఆచూకి దొరికిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే సిల్లీ ఫెలోస్ సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie సిల్లీ ఫెలోస్ with us? Please send it to us ([email protected]).