సింగం 123 సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్య పాత్రాలలో నటిస్తున్నారు. ఈసినిమాకి దర్శకత్వం అక్షత్ శర్మ నిర్వహిస్తున్నారు, ఫ్రేమ్స్ ఫాక్టరీ పతాకంపై మంచు విష్టు నిర్మిస్తున్నారు.
కథ
పోలీస్ స్టేషన్ కడితే కూల్చేస్తా...పోలీస్ అనేవాడు అడుగుపెడితే కాల్చేస్తా అనే విలన్ లింగం . అతను ఉండే సింగరాయకొండలో సారా వ్యాపారం చేస్తూ, దొంగనోట్లు ముద్రిస్తూ ఇలా అనేక సినిమాటెక్ అక్రమాలుకు పాల్పడుతూంటాడు. అక్కడ జనం పడే ఇబ్బందులను గమనించిన హోం మినిస్టర్..ఆ ఊళ్లోని సీక్రెట్ పోలీస్ స్టేషన్ కు ..ఓ సీక్రెట్ పోలీస్ అధికారిగా సింగం 123 (సంపూర్ణేష్ బాబు) ని అపాయింట్ చేస్తాడు. ఇదే సమయంలో సంపూర్ణేష్ బాబు సింగరాయకొండతో తనకున్న అనుబంధం గురించి తెలుసుకుంటాడు. సింగరాయకొండలో సింగం తనదైన శైలిలో విలన్ కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే సింగం పోలీస్ కాదనే ఒక విషయం విలన్‌కి తెలుస్తుంది. నిజంగానే సింగం పోలీస్ కాదా? విలన్ ‘లింగం'కు, సింగంతో ఉన్న పగ ఏంటీ? సింగం తండ్రి జంగం(పృద్వీ) ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.