స్లమ్ డాగ్ హస్బండ్ సినిమా కామిడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంజైయ్ రావు, ప్రనవి మానుకోండ, బ్రహ్మజి, సప్తగిరి, రఘు కరుమంచి, యద్దమ్మ రాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఆర్ శ్రీధర్ వహించారు. నిర్మతలు అప్పి రెడ్జి, వెంకట అన్నప రెడ్డి కలిసి నిర్మించారు. సంగీతం బీమ్స్ భీమ్స్ సిసిరోలియో అందించారు.
కథ
పాతబస్తీలో కళ్లజోడు అమ్ముకొనే కుర్రాడు లక్ష్మణ్ అలియాస్ లచ్చి (సంజయ్ రావు) జీవితంలో తనకు నచ్చినట్టు బతుకుతుంటాడు. మౌనిక (ప్రణవి మానుకొండ) అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి లచ్చి, మౌనిక పెళ్లి చేసుకోవాలని అనుకొంటారు. కానీ కొన్ని కారణాల వల్ల బేబీ అనే కుక్కతో పెళ్లి జరిపించి ఆ తర్వాత మౌనికతో పెళ్లికి సిద్దమవుతారు. కానీ బేబీని పెళ్లి చేసుకొన్నందున విడాకులు తీసుకోకుండా మౌనికను పెళ్లి చేసుకోవద్దని లచ్చికి కుక్క యజమాని (వేణు పోల్సాని)లీగల్ నోటీసులు పంపుతాడు. మౌనిక, లచ్చి ప్రేమ కథ ఎలా సాగింది? మౌనికతో పెళ్లికి ముందు వారిద్దరి మధ్య రొమాన్స్ ఎలా జరిగింది? మౌనికతో పెళ్లికి ముందు లచ్చికి ఎందుకు కుక్కతో పెళ్లి చేయాలని అనుకొన్నారు? మౌనిక పెళ్లికి ముందు కుక్క యజమాని ఎందుకు లీగల్ నోటీసులు పంపాడు? లీగల్ నోటీసుల అందుకొన్న తర్వాత కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? కుక్కతో లచ్చికి విడాకుల విషయంలో కోర్టు ఎలా స్పందించింది? విడాకుల కేసు నేపథ్యంలో మౌనిక తీసుకొన్న నిర్ణయం ఏమిటి? కుక్కతో లచ్చికి విడాకులు దొరికాయా? మౌనికను లచ్చి పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిరాకరించాడు అనే ప్రశ్నలకు సమాధానమే స్లమ్ డాగ్ హస్పెండ్ (Slum Dog Husband) సినిమా.
రీలీజ్
ఈ సినిమా 2023 జూలై 29న విడుదల అయ్యింది
ట్రైలర్
సినిమా ట్రైలర్ చూస్తుంటే మూవీ మొత్తం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. కుక్కతో పెళ్లి అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మూవీ టీమ్. ఇలాంటి కాన్సెప్ట్ లు తెలుగు సినిమా కామెడీ సీన్లలో చూసే ఉంటాం. అయితే ఇదే లైన్ తో మూవీ తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ మూవీను తెరకెక్కించారు దర్శకుడు. ట్రైలర్ లో కామెడీ పాళ్లు బాగానే కనిపిస్తున్నాయి. డైలాగ్స్, మ్యూజిక్ కూడా పర్వాలేదనిపిస్తోంది.