సోలో సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, నిషా అగర్వాల్, ప్రకాష్‌రాజ్, జయసుధ, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, అలీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పరుశురామ్ నిర్వహించారు మరియు నిర్మాణం ఎస్వీకే సినిమా నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
సాలిడ్ లవ్ స్టోరీ గా చెప్పబడుతున్న ఈ చిత్రంలో గౌతమ్(నారా రోహిత్)ఓ అనాధ.అతనికి ఒకటే జీవితాశయం.అదేమిటంటే అనాధ అయిన తాను గత పాతికేళ్లుగా సోలో బ్రతకు వెళ్లదీస్తున్నాడు కాబట్టి తను ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లిచేసుకుని వాళ్ళ కుటుంబంలో ఒకడై తన సోలో లైప్ కి బై చెప్పాలని.అందుకు తగినట్లు ప్రయత్నాలు చేస్తూంటే అతనికి డాక్టర్ కోర్సు చదువుతున్న వైష్ణవి(నిషా అగర్వాల్)పరిచమవుతుంది.రకరకాల కామిడీ ప్రయత్నాలతో ఆమెకు దగ్గరైన గౌతమ్ ఆమె తండ్రి(ప్రకాష్ రాజ్)ని కలుస్తాడు.అయితే ఆమె తండ్రికి గౌతమ్ లాగే ఓ జీవితాశయం.అదేమిటంటే..తన కూతురుకి ఎట్టి పరిస్దితుల్లోనూ అనాధలకు ఇవ్వకూడదని,ఉమ్మడి కుటుంబంలోనే ఇవ్వాలని.ఎందుకంటే ఆయన అక్క(జయసుధ)ఓ అనాధని ప్రేమించి పెళ్లి చేసుకుని,కుటుంబం లేకుండా చేసుకుందని.అలా ఇద్దరూ ఉమ్మడి కుటుంబాలే కోరుకోవంటంతో ఈ ప్రేమ సఫలం కాదు...గౌతమ్ ని రిజెక్టు చేస్తాడు.అంతేగాక ఆమెకు విశ్వనాధం(షాయీజీ షిండే)కో మ్యారేజి నిశ్చయిస్తాడు.అప్పుడు గౌతమ్ సోలో గా ఏమి చేసి ఆమెను దక్కించుకున్నాడనేది మిగతా కథ.