X
స్పై
Action | 29 Jun 2023 | U/A | 135 Mins
Telugu

స్పై స్టోరీ

స్పై సినిమా యాక్షన్, థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిఖిల్‌కు జోడిగా ఐశ్వర్యా మీనన్‌, రవి వర్మ, అభినవ్, సానియా ఠాకూర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం  గ్యారీ బీహెచ్‌ వహించారు . చరణ పాకాల సంగీతం అందించారు. నిర్మాత   కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మించారు. 

కథ
విజయ్ అలియాస్ జయ్ (నిఖిల్ సిద్దార్థ్) రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో పనిచేసే ఏజెంట్. జయ్ సోదరుడు సుభాష్ (ఆర్యన్ రాజేష్) రా ఏజెంట్‌గా పనిచేస్తూ శత్రువుల చేతిలో మరణిస్తాడు. సోదరుడి మరణం ఓ పక్క వెంటాడుతుండగా.. మరో వైపు దేశం కోసం తన కొలిగ్ కమల్ (అభినవ్ గోమటం) పలు మిషన్స్‌లో పాల్గొంటుంటాడు. ఈ క్రమంలో వైష్ణవి (ఐశ్వర్య మీనన్)తో ప్రేమలో పడుతాడు. భారత్‌లో విధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఖాదర్ () ప్లాన్స్ విచ్ఛిన్నం చేయడానికి కమల్, వైష్ణవితో కలిసి జోర్డాన్‌కు వెళ్తాడు. సుభాష్ ఎలా చనిపోయాడు? చనిపోయాడనుకొన్న ఖాదర్ ఎలా బతికి వచ్చాడు? తన సోదరుడు మరణం వెనుక కారణాలను తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నించాడు? నేతాజీ ఫైల్స్‌కి ఈ సినిమా కథకు సంబంధం ఏమిటి? జయ్‌తో ప్రేమలో పడిన వైష్ణవి ఎవరు? తన సోదరుడి మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు? ఖాదర్‌ ప్లాన్స్ ఎలా భగ్నం చేశాడు? జయ్ పాల్గొనే మిషన్‌కు సపోర్ట్ చేసిన అర్జున్ రోల్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే స్పై సినిమా. 

రిలీజ్ డేట్ 
‘స్పై’. జూన్ 29వ తేదీన రిలీజ్ అయ్యింది. 

ట్రైలర్‌ 
‘చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు. దాస్తుంది. దానికి సమాధానం మనమే వెతకాలి.’ అంటూ మకరంద్ దేశ్‌పాండే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. వెంటనే‘ఖాదిర్‌ను చంపామని ప్రపంచానికి చెప్పాం. కానీ వాడింకా బతికే ఉన్నాడు. ఎలా?’ అంటూ సచిన్ ఖేడ్కర్ అడుగుతాడు. అఖండ సినిమాలో విలన్ పాత్రలో నటించిన నితిన్ మెహతా ఈ ఖాదిర్ పాత్రలో కనిపించారు.

నేతాజీ ఫైల్స్ ఖాదిర్ అనే టెర్రరిస్టుకి దొరకడం, వాటిని అతను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించి, స్పై అయిన నిఖిల్ దాన్ని ఆపడానికి ప్రయత్నించడంలో ఈ సినిమా సాగనుందని ట్రైలర్‌ను బట్టి అర్థం అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఎన్నో దేశాల్లో ఈ సినిమా చిత్రీకరించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రివెంజ్ యాంగిల్ కూడా ఉంది. నిఖిల్ అన్నయ్య సుభాష్ పాత్రలో ఆర్యన్ రాజేష్ కనిపించారు. అన్నయ్య చావుకి ప్రతీకారం తీర్చుకునే తమ్ముడి పాత్రలో నిఖిల్ సిద్థార్థ్‌ను చూడవచ్చు. ట్రైలర్ చివర్లో రానా క్యామియోను చూపించారు. ‘స్వాతంత్ర్యం అంటే ఒకడిచ్చేది కాదు. మనం లాక్కునేది. ఇది చెప్పింది నేను కాదు... నేతాజీ.’ అనే డైలాగ్ రానా గొంతులో వినవచ్చు. ఓవరాల్‌గా ట్రైలర్‌ను మంచి యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+