శ్రీకారం సినిమా ఫ్యామిలి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వా నంద్, ప్రియాంక అరుళ్ మోహన్, రావు రమేష్, సాయికుమార్, సత్య అక్కల, నరేష్, మురళీ శర్మ, సప్తగిరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిశోర్ రెడ్డి వహించారు. అచంట రాము, అచంట గోఫినాథ్ కలిసి నిర్మించారు. మిక్కి జె.మేయర్ సంగీత అందించారు.
కథ
తిరుపతి ప్రాంతానికి చెందిన పేద రైతు కుటుంబానికి చెందిన కార్తీక్ (శర్వానంద్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన కంపెనీలో పనిచేసే చైత్ర (ప్రియాంక అరుల్ మోహన్)తో ప్రేమలో పడుతాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా భారీ వేతనం అందుకొనే కార్తీక్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ అనూహ్యమైన నిర్ణయం తీసుకొంటాడు. అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైన కార్తీక్ సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి రైతుగా మారాలనుకొంటాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదలి వ్యవసాయం చేయాలనే ఆలోచన కార్తీక్‌లో కలుగడానికి కారణం ఏమిటి? ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కార్తీక తల్లిదండ్రుల రియాక్షన్ ఏమిటి? కార్తీక్ తీసుకొన్న అనూహ్యమైన నిర్ణయానికి చైత్ర స్పందన ఏమిటి? జాబ్ వదలిసిన కార్తీక్‌కు సేద్యం చేసే సమయంలో ఎదురైన కష్టాలు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? కార్తీక్ తన లక్ష్యాన్ని చివరకు చేరుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే శ్రీకారం మూవీ.