టెర్రర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, నికిత తుక్రల్, నాజర్, కోట శ్రీనివాస రావు, పృద్వి, రవి వర్మ, సుధా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సతీష్ కశెట్టి నిర్వహించారు మరియు నిర్మాత శైక్ మస్తాన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు.
కథ
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విజయ్ (శ్రీకాంత్) కు సిటీలో బాంబ్ బ్లాస్ట్ లు జరగనున్నాయనే విషయం తెలుస్తుంది. దాన్ని ఆపటానికి బయిలు దేరిన అతనికి తన డిపార్టమెంట్ నుంచే అడ్డంకులు ఎదురౌతాయి. అంతేకాదు..బ్లాస్ట్ ప్లానింగ్ వెనక భారీగా పొలిటికల్ హస్తాలు ఉన్నాయని క్రమంగా అర్దమవుతుంది. పై నుంచి వచ్చే ప్రెజర్స్ ని తట్టుకుంటూ... అసలు ఎవరు దాడి చేయబోయే ముష్కరులు ఎవరు...వారు ఎక్కడ దాక్కుని ఉన్నారు...ఏ రోజు బ్లాస్టింగ్స్ జరగబోతున్నాయి...అనేవి ఎలా ఇన్విస్టిగేట్ చేసి తెలుసుకున్నాడు... వాటిని ఎలా ఆపాడు అనేది ఉత్కంఠ మిళితం చేసిన కథనంతో చెప్పిన కథ. ఈ చిత్రం లో కథ ఉందని అనటం కన్నా కథనం ఉందని చెప్పాలి.