శ్రీనివాస కళ్యాణం (2018)(U)
శ్రీనివాస కళ్యాణం స్టోరి
శ్రీనివాస కళ్యాణం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, రాశీఖన్నా, నందిత శ్వేత, జయసుధ, సితార, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్, నరేష్, గిరిబాబు, అన్నపూర్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సతీస్ వేగేశ్న వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూర్చరు.
కథ
సంప్రదాయమైన ఉమ్మడి కుటుంబానికి (జయసుధ, నరేష్, రాజేంద్రప్రసాద్) శ్రీనివాస రాజు (నితిన్) చండీగడ్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడే పార్ట్‌టైం జాబ్ చేసే శ్రీదేవి అలియాస్ శ్రీతో ప్రేమలో పడుతాడు. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ మాగ్నెట్ అయిన ఆర్కే (ప్రకాశ్ రాజ్) కూతురైన శ్రీ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిగా కాకుండా ఛండీగడ్‌లో సాధారణ జీవితం గడుపుతుంది. ఈ క్రమంలో రాజు, శ్రీ ప్రేమలో పడుతారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొంటారు. కానీ పెళ్లికి ఒప్పుకునే ముందు రాజుకు ఆర్కే ఓ కండిషన్ పెడుతాడు. అంతా సవ్యంగా జరుగుతుందనే సమయంలో ఆ కండిషన్ కారణంగా పెళ్లి పీటల మీద నుంచి బయటకు వస్తాడు. శ్రీనివాస రాజు పెళ్లి పీటల మీద నుంచి ఎందుకు లేచి రావాల్సి వచ్చింది. ఎలాంటి సమస్య శ్రీనివాసరాజును వేధించింది? ఆర్కే పెట్టిన కండిషన్ ఏమిటి? పెళ్లి పీటల మీద నుంచి లేచి రావడంతో రాజుపై కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏమిటి? తనను కాదని శ్రీని పెళ్లి చేసుకొన్నందుకు మరదలు (నందిత శ్వేత) ఎలాంటి ఆవేదనకు గురైంది? చివరికి శ్రీనివాసరాజు కళ్యాణం ప్రశాంతంగా జరుగడానికి శ్రీ అడిగిన అప్పు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే శ్రీనివాస కల్యాణం సినిమా కథ.