X
సుబ్రమణ్యం ఫర్ సేల్
Action | Romance | 24 Sep 2015 | U/A |
Telugu

సుబ్రమణ్యం ఫర్ సేల్ స్టోరీ

సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులోసాయి ధర్మతేజ్, రిజిన కాశంద్ర, మరియు నాగేంద్ర బాబు, సుమన్, రావు రమేష్, కోట శ్రీనివాస రావు ముఖ్య పాత్రాలలో నటిస్తున్నారు.  దర్శకత్వం హరిశ్ శంకర్ నిర్వహిస్తున్నారు, ఈ చిత్రాన్ని దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర ప్రోడక్షన్ లో నిర్మిస్తున్నారు. సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుస్తున్నారు. 

కథ

సుబ్రమణ్యం(సాయి ధరమ్ తేజ) నిరంతరం డబ్బు సంపాదించాలని తపిస్తూ, తనని తాను అమ్మకానికి పెట్టుకుంటూంటాడు. అందుకే అమెరికా వెళ్లి రెస్టారెంట్‌లో వెయిటర్‌లా, టాక్సీ డ్రైవర్‌గా.. డబ్బు కోసం ఇలా చాలా ఉద్యోగాలు చేస్తూ తనను, తన సమయాన్ని అమ్ముకుంటూ సంపాదనలో బిజీగా ఉంటూంటాడు. ఆ టైంలోనే సీత(రెజీనా)నా పరిచయం అవుతుంది. ఆమె కు కర్నూల్ లో పెళ్లి ఫిక్సైన సమయంలో ...ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ అమెరికా కుర్రాడితో ప్రేమలో పడి అమెరికా పారిపోయి వచ్చేస్తుంది. అమెరికా వచ్చాక...అతను ఓ మంచివాడు కాదని తెలుసుకున్న సమయంలో సుబ్రమణ్యం పరిచయమై అండగా నిలుస్తాడు. అంతేకాకుండా..ఆమెకు మొగుడు కావాలి సినిమా తరహాలో భర్తగా నటించటానికి డబ్బులు మాట్లాడుకుని ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చాక అక్కడ ఆ ఇంట్లో బావగారు బాగున్నారా టైపు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే ప్రయత్నాలు మొదలెట్టి ఆమెతో ప్రేమలో పడతాడు. ఇంతకూ సుబ్రమణ్యంకు అంత డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏమిటి...ఆమె సమస్యలను ఎలా పరిష్కరించాడు, వారి ప్రేమ కథ ఎలా ముగింపుకు వచ్చింది వంటి ప్రశ్నలుకు సమాధానం తట్టకపోతే మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+