X
Home టాప్ లిస్టింగ్

సాయి పల్లవి కెరీర్ బెస్ట్ టాప్ 5 తెలుగు మూవీస్

Author Administrator | Published: Tuesday, May 9, 2023, 10:58 AM [IST]

సినీ పరిశ్రమలో హీరోయిన్ సాయి పల్లవి స్థానం ప్రత్యేకం గ్లామరస్ షోలకు దూరంగా ఉంటూ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. హీరోయిన్లు వెండితెరని తమ గ్లామర్ తో హీటేక్కిస్తున్న టైంలో అందాల ఆరబోతకు ఆస్కారం ఇవ్వకుండా తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులని ఫిదా చేస్తోంది. సాయి పల్లవి తన అసాధారణ నటనతో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటూ ఉంది. ఆమె నటించిన ప్రతి సినిమా లోనూ ఆమె పాత్ర హైలైట్ గా నిలిచింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి టాలీవుడ్ లో ఇప్పటివరకు నటించిన సినిమాల్లో టాప్ 5 మూవీస్ గురించి తెలుసుకుందాం.


cover image
ఫిదా
1

సాయి పల్లవి బ్లాక్ బస్టర్  ఫిదా  మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలంగాణ యాసలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని మరీ సాయి పల్లవి ప్రేక్షకులను కట్టిపడేసింది.  తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. 

ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)
2

ఈ మూవీలో నాని, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ మూవీలో సాయి పల్లవి చిన్ని పాత్రలో కాస్త నాటీగా నటించి మెప్పించింది. ఈ మూవీలో సాయి పల్లవి నటన మాస్ ప్రేక్షకులని కూడా మెప్పించింది. స్క్రీన్ మీద నానితో కలిసి ఉంటే ప్రేక్షకుడు సాయిపల్లవిని చూసేంతగా ఆకట్టుకొన్నది. గ్లామర్‌తో ఆలరించింది. కథ మొత్తం నాని, భూమిక మీద నడిచినా.. అవకాశం దొరికిన ప్రతీచోట ప్రేక్షకుడికి నటనతో, డ్యాన్స్‌తో మైమరిపిస్తుంది.

శ్యామ్ సింగరాయ్
3

ఈ సినిమాలో సాయి పల్లవి దేవదాసిగా కెరియర్‌లో గుర్తిండిపోయే క్యారెక్టర్ చేసింది. ఆమె పాత్రని పరిచయం చేసిన తీరు అభినందనీయం. క్లైమాక్స్‌లో ఆమె లుక్ చూసి సర్ ప్రైజ్ అవుతారు. క్లాసికల్ డాన్స్‌లో తనకు తానే సాటి అనేట్టు చేసింది. దేవదాసిగా ఉన్న మైత్రీ.. రోజీగా మారిన తీరు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలోని ఆమె పాత్రకు ఆమెకు గోల్డ్ మెడల్ దక్కింది.

లవ్ స్టోరి
4

చిన్ననాటి నుంచే లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది.ఈ సినిమాలో తన నటన జనాలను బాగా మెప్పించింది.  ఈ సినిమాలో తన డ్యాన్స్ తో జనాలను బాగా ఆకట్టుకుంది.అయితే ఇప్పటి వరకు తను నటించిన సినిమాలన్నింటిలో ఫిదా సినిమాలో భానుమతి పాత్ర, లవ్ స్టోరీలో మౌనిక క్యారెక్టర్ అద్భుతం అని చెప్పుకోవచ్చు.

విరాట పర్వం
5

తెలంగాణ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరెక్కించారు. వరంగల్ ప్రాంతంలో సరళ అనే అమ్మాయి జీవితంలో సంఘటనలు, ఆ ఘటన చుట్టూ రాజకీయ, నక్సల్ వర్గాలు మధ్య జరిగిన సంఘర్షణను విరాట పర్వంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రేక్షకులు సాయి పల్లవి పర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో సాయి పల్లవి యాక్టింగ్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అంతేగాక వెన్నెల పాత్రలోని ప్రేమను తన కళ్ళతో పలికించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+