X
తెలుగు » సినిమాలు » సుబ్రమణ్యం ఫర్ సేల్
సుబ్రమణ్యం ఫర్ సేల్

సుబ్రమణ్యం ఫర్ సేల్

Action | Romance | 24 Sep 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

సుబ్రమణ్యం ఫర్ సేల్ స్టోరీ

సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధర్మతేజ్, రిజిన కాశంద్ర , మరియు నాగేంద్ర బాబు, సుమన్, రావు రమేష్, కోట శ్రీనివాస రావు ముఖ్య పాత్రాలలో నటిస్తున్నారు.  దర్శకత్వం హరిశ్ శంకర్ నిర్వహిస్తున్నారు, ఈ చిత్రాన్ని దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర ప్రోడక్షన్ లో నిర్మిస్తున్నారు. సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుస్తున్నారు.  కథ సుబ్రమణ్యం(సాయి ధరమ్ తేజ) నిరంతరం డబ్బు సంపాదించాలని తపిస్తూ, తనని తాను అమ్మకానికి పెట్టుకుంటూంటాడు. అందుకే అమెరికా వెళ్లి రెస్టారెంట్‌లో వెయిటర్‌లా, టాక్సీ డ్రైవర్‌గా.. డబ్బు కోసం ఇలా చాలా ఉద్యోగాలు చేస్తూ తనను, తన సమయాన్ని అమ్ముకుంటూ సంపాదనలో బిజీగా ఉంటూంటాడు. ఆ టైంలోనే సీత(రెజీనా)నా పరిచయం అవుతుంది. ఆమె కు కర్నూల్ లో పెళ్లి ఫిక్సైన సమయంలో ...ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ అమెరికా కుర్రాడితో ప్రేమలో పడి అమెరికా పారిపోయి వచ్చేస్తుంది. అమెరికా వచ్చాక...అతను ఓ మంచివాడు కాదని తెలుసుకున్న సమయంలో సుబ్రమణ్యం పరిచయమై అండగా నిలుస్తాడు. అంతేకాకుండా..ఆమెకు మొగుడు కావాలి సినిమా తరహాలో భర్తగా నటించటానికి డబ్బులు మాట్లాడుకుని ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చాక అక్కడ ఆ ఇంట్లో బావగారు బాగున్నారా టైపు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే ప్రయత్నాలు మొదలెట్టి ఆమెతో ప్రేమలో పడతాడు. ఇంతకూ సుబ్రమణ్యంకు అంత డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏమిటి...ఆమె సమస్యలను ఎలా పరిష్కరించాడు, వారి ప్రేమ కథ ఎలా ముగింపుకు వచ్చింది వంటి ప్రశ్నలుకు సమాధానం తట్టకపోతే మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే.
Read More

సుబ్రమణ్యం ఫర్ సేల్ కాస్ట్ & క్రూ

సుబ్రమణ్యం ఫర్ సేల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హారిస్ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సుబ్రమణ్యం ఫర్ సేల్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
బావగారు బాగున్నారా, మొగడు కావాలి మాత్రమే కాక అనేక పాత,కొత్త సినిమాల సీన్స్ కలబోసుకుని ఈ మెగా మేనల్లుడు సినిమా దిగింది. ప్రతీ సీన్ ఎక్కడో చూసినట్లు అనిపించటం ప్రత్యేకతగా దర్శకుడు కావాలని డిజైన్ చేసినట్లు ఉంటుంది. అంతెందుకు హీరోయిన్ కంటిన్యూగా చెప్పే డైలాగు కూడా ..'సీతతో అంత ఈజీ కాదు'... ఇంతకు ముందు ఎక్కడో విన్నట్లు ఉంటుంది. అలాగే ప్రధాన పాత్రలన్నిటికి ప్లాష్ బ్యాక్ లు ఉండటం దీని స్పెషాలిటి...నాలుగైదు ప్లాష్ బ్యాక్ లు ఒకే కథలో వస్తున్నప్పుడే దర్శకుడు జాగ్రత్తపడి ఉండాల్సింది. ఏదైనా ఎక్కడా ఫ్రెష్ ఫీల్ అనేది లేని ఈ సినిమా హీరో అభిమానులుకు మాత్రం నచ్చేలా నాలుగు ఫైట్స్, ఆరు ఫైట్స్ తో ఫార్ములాతో వచ్చింది. డిస్కౌంట్ సేల్ కు ఇచ్చినా కూడా కష్టమే అనిపిస్తుంది.

సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సుబ్రమణ్యం ఫర్ సేల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+