సుప్రీమ్ (2016)(U/A)
Release date
05 May 2016
genre
సుప్రీమ్ స్టోరి
సుప్రీమ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి ధరమ్ తేజ్, రాషి ఖన్నా, సాయికుమార్, కబీర్ దుహాన్ సింగ్, పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, వెన్నేల కిశోర్, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ రవిపూడి నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు.
కథ
బాలు(సాయి ధరమ్ తేజ) ఓ ఎగ్రిసివ్ టాక్సీ డ్రైవర్. తాగుబోతు తండ్రి (రాజేంద్రప్రసాద్) కు చూసుకుంటూ గడిపే అతనికి బెల్లం శ్రీదేవి(రాశిఖన్నా) అనే పోలీస్ ఇన్సపెక్టర్ తో సినిమాటెక్ లవ్ స్టోరీ. జీవితం ఇలా పాటలు, చిన్న చిన్న తగువులుతో గడిచిపోతూండగా ఓ రోజు అతనికి ఓ పసివాడు రాజన్ (మైఖల్ గాందీ) అనే పిల్లాడు తగులుతాడు. తల్లి తండ్రి లేని ఆ పిల్లాడ్ని తన దగ్గర పెట్టుకుని సాకుతూంటాడు. మరో ప్రక్క ఆ పిల్లాడు రాజన్ కోసం ఓ పెద్ద విలన్ విక్రమ్ సర్కార్(కబీర్ ఖాన్) హైదరాబాద్ లో వెతుకుతూంటాడు. అంతేకాదు అదే పిల్లాడు కోసం నారాయణరావు (సాయికుమార్) అనే సామాజిక వేత్త వెతుకుతూంటాడు. మొత్తానికి ఓ రోజు విక్రమ్ సర్కార్ మనుష్యులు శ్రమ ఫలించి...మన హీరో బాలుని కొట్టి, రాజన్ ని కిడ్నాప్ చేసి ఎత్తుకు పోతాడు. ఇంతకీ అసలు రాజన్ ఎవరు...అతని బ్యాక్ స్టోరీ ఏంటి...విలన్స్ కు అతనికి లింకేటి...బాలు..ఆ పిల్లాడిని ఎలా సేవ్ చేసాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie సుప్రీమ్ with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు