స్వాతి ముత్యం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లం కొండ గణేష్, వర్ష బాలమ్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లక్ష్మణ్ కె కృష్ణ వహించారు. నిర్మాత నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సాగర్ మహతి అందించారు.
కథ
పిఠాపురం పట్టణానికి చెందిన బాలమురళీకృష్ణ అలియాస్ బాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. తల్లిదండ్రుల చాదస్తం కారణంగా పెళ్లి కుదరక ఇబ్బంది పడుతుంటాడు. ఓ పెళ్లిచూపుల్లో భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ)ను చూసి ప్రేమలో పడుతాడు. రకరకాల సమస్యలను దాటుకొని వారి ప్రేమ.. పెళ్లీ పీటల వరకు వస్తుంది. పెళ్లికి కొద్ది గంటలకు ముందు.. శైలజ (దివ్య శ్రీపాద) అనే యువతి ఓ తొమ్మిది నెలల బిడ్డను తీసుకొచ్చి.. ఈ బాబు నీ కుమారుడు అని బాల చేతిలో పెడుతుంది. పెళ్లికి కొద్దిగంటల ముందు తన జీవితంలో చోటు చేసుకొన్న సమస్య కారణంగా బాల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఇంతకు శైలజ ఎవరు? శైలజ తీసుకొచ్చిన బిడ్డ ఎవరు? శైలజ తీసుకొచ్చిన బాబు నిజంగా బాలాకు పుట్టిన బిడ్డేనా? కాబోయే భర్తకు ముందే బిడ్డ ఉన్నాడనే విషయం తెలిసిన భాగ్యలక్ష్మి పరిస్థితి ఏమిటి? తమ అల్లుడికి పెళ్లికి ముందే బిడ్డ ఉందని తెలిసిన భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు (సురేఖవాణి, నరేష్), పెదనాన్న (గోపరాజు రమణ) రియాక్షన్ ఏమిటి? పెళ్లికి ముందే తమ కొడుకు బిడ్డను కన్నాడని తెలిసిన బాలా తల్లిదండ్రులు (ప్రగతి, రావు రమేష్) పరిస్థితి ఏమిటి? శైలజకు వచ్చిన కష్టానికి ఎలాంటి పరిష్కారం లభించింది? కాబోయే భర్త విషయంలో భాగ్యలక్ష్మి ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? చివరకు బాల, భాగ్యలక్ష్మి ప్రేమ పెళ్లిపీటలకు ఎక్కిందా? అనే ప్రశ్నలకు సమాధానమే స్వాతిముత్యం సినిమా కథ.