X
తెలుగు » సినిమాలు » స్వాతి ముత్యం
స్వాతి ముత్యం

స్వాతి ముత్యం

Romance | 05 Oct 2022 | U/A | 124 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

స్వాతి ముత్యం స్టోరీ

స్వాతి ముత్యం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లం కొండ గణేష్, వర్ష బాలమ్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లక్ష్మణ్ కె కృష్ణ వహించారు. నిర్మాత నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం సాగర్ మహతి అందించారు.    కథ పిఠాపురం పట్టణానికి చెందిన బాలమురళీకృష్ణ అలియాస్ బాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. తల్లిదండ్రుల చాదస్తం కారణంగా పెళ్లి కుదరక ఇబ్బంది పడుతుంటాడు. ఓ పెళ్లిచూపుల్లో భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ)ను చూసి ప్రేమలో పడుతాడు. రకరకాల సమస్యలను దాటుకొని వారి ప్రేమ.. పెళ్లీ పీటల వరకు వస్తుంది. పెళ్లికి కొద్ది గంటలకు ముందు.. శైలజ (దివ్య శ్రీపాద) అనే యువతి ఓ తొమ్మిది నెలల బిడ్డను తీసుకొచ్చి.. ఈ బాబు నీ కుమారుడు అని బాల చేతిలో పెడుతుంది. పెళ్లికి కొద్దిగంటల ముందు తన జీవితంలో చోటు చేసుకొన్న సమస్య కారణంగా బాల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఇంతకు శైలజ ఎవరు? శైలజ తీసుకొచ్చిన బిడ్డ ఎవరు? శైలజ తీసుకొచ్చిన బాబు నిజంగా బాలాకు పుట్టిన బిడ్డేనా? కాబోయే భర్తకు ముందే బిడ్డ ఉన్నాడనే విషయం తెలిసిన భాగ్యలక్ష్మి పరిస్థితి ఏమిటి? తమ అల్లుడికి పెళ్లికి ముందే బిడ్డ ఉందని తెలిసిన భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు (సురేఖవాణి, నరేష్), పెదనాన్న (గోపరాజు రమణ) రియాక్షన్ ఏమిటి? పెళ్లికి ముందే తమ కొడుకు బిడ్డను కన్నాడని తెలిసిన బాలా తల్లిదండ్రులు (ప్రగతి, రావు రమేష్) పరిస్థితి ఏమిటి? శైలజకు వచ్చిన కష్టానికి ఎలాంటి పరిష్కారం లభించింది? కాబోయే భర్త విషయంలో భాగ్యలక్ష్మి ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? చివరకు బాల, భాగ్యలక్ష్మి ప్రేమ పెళ్లిపీటలకు ఎక్కిందా? అనే ప్రశ్నలకు సమాధానమే స్వాతిముత్యం సినిమా కథ. 
Read More

స్వాతి ముత్యం కాస్ట్ & క్రూ

స్వాతి ముత్యం సిబ్బంది సమాచారం

దర్శకత్వం లక్ష్మణ్ కె కృష్ణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాగర్ మహాతి
నిర్మాత నాగ వంశీ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

స్వాతి ముత్యం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
వీర్యదానం అనే ఎమోషనల్ పాయింట్ చుట్టూ కుటుంబ విలువలు, బంధాలు, అనుబంధాలతో అల్లుకొన్న చిత్రం స్వాతిముత్యం. మన ఇంటిలో జరిగే సంఘటనలు.. మన కుటుంబంలో ఉండే మనుషుల మధ్య సినిమా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ సెకండాఫ్‌లో కథను డీల్ చేసిన విధానం..కథను నడిపించిన తీరు.. పాత్రలను డిజైన్ చేసిన తీరు సినిమాను సక్సెస్ బాటలో నడిపించడానికి దోహదపడ్డాయి. పండుగ సమయంలో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వినోదాన్ని ఆస్వాదించానికి ఆస్కారం ఉన్న చిత్రం స్వాతిముత్యం.

స్వాతి ముత్యం ట్రైలర్

Video Thumbnail

స్వాతి ముత్యం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

స్వాతి ముత్యం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+