తఖాడా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, సునీల్ , తమన్నా, ఆండ్రియా, అశుతోష్ రాణా, నాగబాబు, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, రమాప్రభ, జయప్రకాష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కిషోర్ పార్థాసాని నిర్వహించారు మరియు నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
శివరామకృష్ణ(సునీల్) చిన్నప్పుడు నుంచి భయస్దుడు. అతనికో వీర ధైర్య సాహసాలు కల తమ్ముడు కార్తీక్ (నాగచైతన్య). తండ్రి నాగబాబు(పోలీస్)...డ్యూటీలో ఉండగా చనిపోవటంతో పెద్ద కొడుకైన శివరామకృష్ణ కు జాబ్ ఇచ్చి...ఎప్పుడూ గ్యాంగ్ వార్స్ జరిగే ప్రాంతంలో పోస్టింగ్ వేస్తారు. మొదట ఆ ఉద్యోగానికి ఆసక్తి చూపని...శివరామకృష్ణ..తమ్ముడు ఇచ్చిన ధైర్యంతో వెళ్లి జాబ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ నుంచి అన్నను ఆ గ్యాంగ్ ల నుంచి కాపాడుతూ..ఎలా అతనిలో ధైర్య సాహసాలునింపాడన్నది మిగతా కథ.