తారామణి (2019)(A)
తారామణి స్టోరి
తారామణి సినిమా డ్రామా, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అండ్రియా, అంజలీ, వసంత్ రవి, అజంగం పెరుమాల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామ్ వహించారు మరియు నిర్మాత డి వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు.
కథ
ప్రభురాజ్(వసంత్ రవి) తన తండ్రి కోరిక మేరకు చెన్నై వచ్చి ఓ కాల్ సెంటర్ ఉద్యోగంలో చేరతాడు. అక్కడే అతడికి తన ఆఫీస్ ఎదురుగా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న సాంప్రదాయ బద్దంగా ఉండే సౌమ్య(అంజలి) పరిచయం అవుతుంది. ఆమెను సిన్సియర్‌గా ప్రేమించిన ప్రభు అడిగిన వెంటనే ఆమె అమెరికా వెళ్లడానికి రూ. 3 లక్షలు సహాయం చేస్తాడు. అయితే ఆ డబ్బుతో అమెరికా వెళ్లిన సౌమ్య కొన్ని పరిస్థితుల కారణంగా అక్కడే ఉండిపోయి డబ్బు కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ప్రభు ప్రేమను కాదని యూఎస్ఏలో ఉండే తెలుగు వ్యక్తిని పెళ్లాడుతుంది. లవ్ ఫెయిల్యూర్‌తో భారీగా గడ్డం పెంచుకుని పిచ్చోడిలా తయారైన ప్రభుకు... భర్తతో విడిపోయి ఒక బాబు ఉన్న మోడ్రన్ ఉమెన్ ఆల్థియా జాన్సన్(ఆండ్రియా)తో పరిచయం ఏర్పడుతుంది. ముందు స్నేహంగా మొదలైన వీరి రిలేషన్ ఆపై ప్రేమగా మారుతుంది, ఇద్దరూ సహజీవనం చేస్తుంటారు.
మోకాళ్ల పై వరకు స్కర్టులు వేయడం, మగాళ్లతో క్లోజ్‌గా మూవ్ అవ్వడం, సిగరెట్లు కాల్చడం, మందు కొట్టడం లాంటి అలవాట్లతో సమాజం దృష్టిలో ఆల్థియా తిరుగుబోతు(బిచ్)గా ముద్ర పడుతుంది. మరి ఆల్థియా నిజంగానే తప్పుడు మనిషా? ఆమె జీవితంలోకి ప్రభురాజ్ ఎంటరైన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? సౌమ్య చేతిలో మోసపోయిన ప్రభురాజ్ ఆల్థియా విషయంలో ఎలాంటి ప్రవర్థించాడు? సౌమ్య అతడికి ఎందుకు దూరమైంది? అనేది తర్వాతి కథ.