టాక్సీవాలా (2018)(U/A)
Release date
17 Nov 2018
genre
టాక్సీవాలా స్టోరి
టాక్సీవాలా సినిమా సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళివికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జా మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాహుల్ సింక్రిత్యాన్ వహించారు మరియు నిర్మాత శ్రీనివాస కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జేక్స్ బిజాయ్ స్వరాలు సమకుర్చరు.
కథ
శివ (విజయ్ దేవరకొండ) డిగ్రీ చేతబట్టుకొని తిరిగే ఓ నిరుద్యోగి. బాబాయ్ (మధునందన్) అనే స్నేహితుడు అండతో హైదరాబాద్లో కాలం వెళ్లదీస్తుంటాడు. డబ్బు సంపాదన కోసం ఎన్ని ఉద్యోగాలు చేసిన నచ్చకపోవడంతో చివరికి క్యాబ్ నడుపాలని నిర్ణయించుకొంటాడు. అన్న, వదిన (రవి ప్రకాశ్, కల్యాణి) అందించిన సహాయంతో ఓ పాత కారు కొనుకొంటాడు. కారులో దెయ్యం వల్ల అనేక కష్టాలను ఎదుర్కొంటాడు. కారులోనే దెయ్యం ఎందుకు ఉండాల్సి వచ్చింది? శివకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనకు ఎదురైన ఇబ్బందుల్లో ప్రియురాలి అను (ప్రియాంక జవాల్కర్) ఎలా అండగా నిలిచింది? శిశిర (మాళవిక నాయర్) పాత్రేంటి? సిజ్జు, ఉత్తేజ్ పాత్రలేంటి? యమున ఎలాంటి పాత్రలో కనిపించింది? చివరకు తనకు ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అనే ప్రశ్నలకు సమాధానమే టాక్సీవాలా చిత్రం.
**Note:Hey! Would you like to share the story of the movie టాక్సీవాలా with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు