X
Home టాప్ లిస్టింగ్

తెలుగు రాష్ట్రాలు.. ఫ‌స్ట్ వీక్‌లో టాప్ షేర్ సాధించిన టాలీవుడ్ మూవీస్‌

Author Administrator | Updated: Friday, June 30, 2023, 04:57 PM [IST]

స్టార్ హీరోల‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. దానికి త‌గ్గ‌ట్టు అద్భుత‌మైన క‌థ కుదిరితే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వారికి తిరుగుండ‌దు. ఇక స‌ద‌రు సినిమాలు వ‌సూళ్ల‌లో సునామీల‌ను క్రియేట్ చేశాయి. అలాంటి సినిమాల్లో కొన్నింటి సినిమాలు వాటి కలెక్ష‌న్స్ వివ‌రాలేంట‌నే వివరాల్లోకి వెళితే..


cover image
ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం

పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన చిత్రం RRR. భారీ అంచనాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం తొలి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 172 కోట్ల రూపాయ‌ల షేర్ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసి నెంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ సినిమాను మ‌రే సినిమా బీట్ చేయ‌లేదు. 

బాహుబలి ది కంక్లూజన్‌

తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబ‌లి. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ సినిమా రెండు భాగాలుగా వ‌చ్చింది. అందులో బాహుబ‌లి 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి వారం రూ.107.21 కోట్లు రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేసింది. దీనికి కూడా రాజ‌మౌళియే దర్శ‌కుడు. 

 

అల వైకుంఠపురములో

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన చిత్రం అల వైకుంఠ పురములో. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు విప‌రీతంగా క‌నెక్ట్ కావటంతో తొలి వారంలోనే ఈ చిత్రానికి రూ.81.66 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. 

సరిలేరు నీకెవ్వరు

మ‌హేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో తెరెక్కిన ఈ సినిమా మొద‌టి వారంలో రూ.76.8 కోట్ల‌ను రాబ‌ట్టింది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న ఇందులో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. 

వాల్తేరు వీరయ్య

సినిమ‌ల్లో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఖైదీ నంబ‌ర్ 150 మంచి స‌క్సెస్‌ను ఇచ్చింది. త‌ర్వాత సాలిడ్ హిట్ రాలేదు. అయితే ఆ కొర‌త‌ను వాల్తేరు వీర‌య్య తీర్చేసింది. వింటేజ్ చిరంజీవిని గుర్తుకు తెచ్చేలా చిరు న‌ట‌న‌, డాన్సులు మెప్పించాయి. ఈ సినిమాలో ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొద‌టి వారంలో రూ.75.47 కోట్లు షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇందులో శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌. 

ఆదిపురుష్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌.. శ్రీరామ చంద్రుడిగా న‌టించిన చిత్రం ఆదిపురుష్‌. సీతాదేవిగా కృతి స‌న‌న్ క‌నిపించింది. త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్స్ విష‌యంలో అస్స‌లు త‌గ్గ‌లేదు. తొలి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.73.27 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ రావ‌టం విశేషం. 

సైరా నరసింహా రెడ్డి

చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన హిస్టారిక‌ల్ మూవీ సైరా న‌ర‌సింహా రెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో రామ్ చ‌ర‌ణ్ సినిమాను నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా వ‌చ్చిన సినిమా అమితాబ్‌, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి వంటి స్టార్స్ న‌టించారు. రెండు తెలుగురాష్ట్రాల్లో మొద‌టి వారంలో రూ. 70.80 కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+