తెగింపు సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అజిత్ కుమార్, మహానంది శంకర్, మంజు వారియర్, సముతిరకణి, యోగి బాబు, భగవతి పెరుమాళ్, వీర బాబు, జాన్ కొక్కెన్ తదితరులు నటించారు. అజిత్‌తో ‘వలిమై’ తీసిన హెచ్.వినోద్‌నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు. సంగీతం అనిరుద్ రవిచందర్, ఎమ్ ఘిబ్రన్ అందించారు.
తమిళ సినిమా ‘తునివు’. దీన్ని ‘తెగింపు’ అనే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసారు.
కథ
విశాఖపట్నంలోని యువర్ బ్యాంక్ దోపిడికి పోలీస్ ఆఫీసర్ (అజయ్)తో కలిసి కొంత మంది గ్యాంగ్‌స్టర్స్ భారీ ప్లాన్ చేస్తారు. అయితే తమ ప్లాన్ ప్రకారం సక్సెస్‌ఫుల్‌గా బ్యాంక్‌లోకి ప్రవేశించిన మాఫియా సభ్యులకు డార్క్ డెవిల్ (అజిత్ కుమార్) షాకిస్తారు. తాను డబ్బు దోచుకొనేందుకు వచ్చానని తన ప్లాన్ చెప్పి మాఫియాకు, బ్యాంక్ అధికారుల, బందీలుగా ఉన్న కస్టమర్లకు డార్క్ డెవిల్ షాకిస్తాడు. గ్యాంగస్టర్లకే షాకిచ్చిన డార్క్ డెవిల్ ఎవరు? వేల కోట్ల రూపాయలను ఎందుకు దోచుకోవాలని ప్లాన్ చేశాడు? బ్యాంక్‌లో ఉన్న డార్క్ డెవిల్ పోలీసులతో ఎలా పోరాడాడు? తన వ్యూహాలతో పోలీసులను ఎలా ఆటపట్టించాడు? బ్యాంక్‌లో ఉన్న డార్క్ డెవిల్‌కు ఎవరు సహాయం చేశారు? డబ్బు దోచుకొనే విషయంలో డార్క్ డెవిల్ అంతిమ లక్ష్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే తెగింపు చిత్ర కథ.