X
Home టాప్ లిస్టింగ్

ఒకప్పటి బాల నటులు, ఇప్పుడు స్టార్ హీరో హీరోయిన్లు, వారెవరంటే..?

Author Administrator | Published: Tuesday, July 21, 2020, 01:42 PM [IST]

బాలనటులుగా టాలీవుడ్‌లో అనేకమంది నటిస్తారు. కానీ కొంతమంది మాత్రమే పెద్దయ్యాక హీరోలుగానూ సక్సెస్ అవుతారు. మహేష్ బాబు దగ్గర నుండి అఖిల్ వరకూ సక్సెస్ బాట పట్టిన హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాల నటులుగా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారే. అలాంటి హీరోల గురించి


cover image
మహేష్ బాబు
1

తన నాలుగేళ్ల వయసులోనే దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'నీడ' అనే చిత్రం ద్వారా.. 1979లో బాల నటుడిగా పరిచయమవ్వగా.. మొత్తంగా 11 ఏళ్లలో 9 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఇక 1999లో 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా పరిచయమై.. ఇప్పుడు సూపర్ స్టార్‌గా కొనసాగుతున్నాడు.

అఖిల్ అక్కినేని
2

1994లో విడుదలైన సిసింద్రీ సినిమాలో కేవలం నెలల వయసున్నప్పుడే నటించిన ఘనత అఖిల్‌కే దక్కుతుంది. 2014లో "మనం" చిత్రంలో చిన్న కెమియో రోల్‌లో కనిపించిన అఖిల్, ఆ తర్వాత 2015లో "అఖిల్" చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

జూనియర్ యన్ టి ఆర్
3

గుణశేఖర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన "రామాయణం" చిత్రం ఎంత పెద్ద హిట్ చిత్రమో మనకు తెలియంది కాదు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటన అందరినీ బాగా ఆకట్టుకుంది. అంతకుముందే బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్రలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. 2001లో విడుదలైన "నిన్ను చూడాలని" చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు జూనియర్ ఎన్టీఆర్.

తరుణ్
4

అంజలి, తేజ, మనసు మమత, పిల్లలు దిద్దిన కాపురం లాంటి సినిమాలలో బాల నటుడిగా రాణించిన తరుణ్ కుమార్ "నువ్వే కావాలి" చిత్రంతో 2000లో హీరోగా మారారు. అదేవిధంగా ఉత్తమ బాల నటుడిగా పలుమార్లు నంది అవార్డు కూడా అందుకున్నారు. 

రోజా రమణి
5

తన 7 ఏళ్ళ వయసులోనే.. తెలుగులో వచ్చిన సూపర్ హిట్ చిత్రం "భక్త ప్రహ్లాద" సినిమాలో ప్రహ్లాదుని పాత్రలో నటించి అందరినీ మెప్పించడం విశేషం. . ఆ తరువాత కాలంలో 5 భాషల్లో ..ఆమె సుమారు 300 చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 

ఆలీ
6

అలీ 1949  కె  రాఘవేంద్ర రావు దర్శకత్వం లో నిండు నూరేళ్లు అనే సినిమా లో ద్వారా నటుడిగా తెరంగేట్రం చేసారు. ఆ తరువాత వచ్చిన సీతాకోక చిలుక చిత్రం లో బాల నటుడిగా నటించారు. ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. 

వెంకటేష్
7

విక్టరీ వెంకటేష్ 1971లో "ప్రేమ్ నగర్" చిత్రంలో చిన్నప్పటి ఏఎన్‌ఆర్ పాత్రను పోషించారు. ఆ తర్వాత బాలనటుడిగా ఆయన ఏ సినిమాల్లోనూ నటించలేదు. ఆ తర్వాత 1986లో విడుదలైన "కలియుగ పాండవులు" చిత్రంతో హీరోగా మారారు వెంకటేష్. 

శ్రీదేవి కపూర్
8

1967లో తమిళ చిత్రసీమలో బాల నటిగా తెరంగేట్రం చేసింది. ఇక తరువాతి కాలంలో ఆమె తెలుగు, తమిళ & హిందీ చిత్రసీమలో ఎన్నో చిత్రాలు చేసి.. చివర వరకు కూడా ఒక సూపర్ స్టార్‌గానే నిలిచింది.

కమల్ హాసన్
9

బాల నటుడిగా దాదాపు 6 చిత్రాల్లో నటించారు. ఆ తరువాత హీరో అయ్యాక 200 పైగా చిత్రాల్లో నటించారు. ఈ మధ్యనే ఆయనకి చిత్ర పరిశ్రమలో 60 ఏళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రముఖులందరూ ఆయన్ని సత్కరించడం జరిగింది.

 

ఆకాష్ పూరి
10

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి చిత్రం "చిరుత" చిత్రం ద్వారానే ఆకాష్ పూరి కూడా పరిచయమయ్యాడు. ఆ తరువాత బుజ్జిగాడు, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించిన ఆకాష్.. 'ఆంధ్ర పోరి' చిత్రంతో హీరోగా మారాడు. ప్రస్తుతం 'రొమాంటిక్' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

తనీష్
11

దేవుళ్లు, మన్మధుడు వంటి చిత్రాల ద్వారా బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తనీష్ "నచ్చావులే" చిత్రంతో హీరోగా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రైడ్, మేం వయసుకు వచ్చాం వంటి యూత్ ఎంటర్ టైనర్స్‌లో కూడా నటించారు. 

 

హన్సిక మొత్వని
12

హన్సిక చాలా బాలీవుడ్ చిత్రాలలో బాల నటిగా కనిపించింది. కోయి మిల్ గయా ఆమె ప్రముఖ చిత్రం, షకలకా బూమ్ బూమ్ ఆమె అత్యంత ప్రసిద్ధ టెలివిజన్ సిరీస్.

అల్లు అర్జున్
13

అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు చిత్రాలలో కనిపించాడు. అతను తన మామ, మెగాస్టార్ చిరంజీవితో కలిసి డాడీ సినిమాలో నటించాడు, ఇంకా  5 సంవత్సరాల వయసులో విజయ్ అనే చిత్రంలో చిన్న పాత్ర చేశాడు.

మంచు మనోజ్ కుమార్
14

మేజర్ చంద్రకాంత్ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్‌టిఆర్‌తో స్క్రీన్ పంచుకున్న గొప్ప గౌరవం మంచు మనోజ్‌కు లభించింది. ప్రస్తుత తరం హీరో మాత్రమే ఆ అవకాశం పొందాడు.

కళ్యాణ్ రామ్
15

1989లో విడుదలైన "బాల గోపాలుడు" చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత ఏ సినిమాలోనూ ఆయన బాలనటుడిగా నటించలేదు. 2003లో విడుదలైన "తొలి చూపులోనే" చిత్రంతో హీరోగా మారారు కళ్యాణ్ రామ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+