X
థాంక్యూ
Romance | 22 Jul 2022 | U/A | 129 Mins
Telugu

థాంక్యూ స్టోరీ

థాంక్యూ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విక్రమ్ కె కుమార్ వహించారు. నిర్మాత  దిల్ రాజు నిర్మించారు . సంగీతం థమన్ అందించారు.

కథ

తల్లి చాటు ప్రేమలో పెరిగిన పేద కుటుంబానికి చెందిన అభిరామ్ హాకీ ప్రేయర్. తండ్రి కలను సాకారం చేయడానికి జాతీయ హాకీ జట్టుకు ఆడాలని కలలు కంటాడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా హాకీని వదిలేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మారి వైద్య అనే యాప్‌ను క్రియేట్ చేసి అమెరికాలో బిలియనీర్ అవుతాడు. తన ఎదుగుదలకు కారణమైన ప్రియతో సహజీవనం చేస్తుంటాడు. ఈ క్రమంలో తాను పెళ్లి ప్రపోజ్ చేయగా.. ప్రియ రిజెక్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. హాకీ నేషనల్ టీమ్‌కు ఆడాలని కలలు కన్న అభిరామ్ ఆ గేమ్‌ను ఎందుకు వదిలేశాడు? తండ్రి కలను మధ్యలోనే అభిరామ్ వదిలేయాల్సి వచ్చింది. అమెరికాలో తనకు ఆశ్రయం ఇచ్చిన కన్సల్టెంట్ రావు (ప్రకాశ్ రాజ్) మరణానికి అభిరామ్ ఎలా కారణమయ్యాడు? అభిరామ్‌ మ్యారేజ్ ప్రపోజల్‌ను ప్రియ ఎందుకు రిజెక్ట్ చేసింది. ప్రియ వదలేసి వెళ్లిన తర్వాత అభిరామ్ పరిస్థితి ఏమిటి? తన జీవితంలో పార్వతి ( మాళవిక నాయర్), చిన్ను (అవికా గోర్) ఎలాంటి పాత్ర పోషించారు? అభిరామ్‌పై పార్వతి తన ప్రేమను ఎందుకు త్యాగం చేసింది? అభిరామ్‌కు చిన్ను ఎలాంటి ప్రేరణను కలిగించింది? తన జీవితానికి ఆసరాగా, స్పూర్తిగా నిలిచిన వ్యక్తులకు అభిరామ్ ఎందుకు థ్యాంక్యూ చెప్పాలనుకొన్నాడు? తన జీవితంలో ఎవరెవరికి అభిరామ్ థ్యాంక్యూ చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే Thank You movie కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+