ది ఘోస్ట్ (2022)(U/A)
Release date
05 Oct 2022
genre
ది ఘోస్ట్ స్టోరి
ది ఘోస్ట్ సినిమా ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇందులో నాగార్జున, సోనాల్ చౌహన్, గల్ పనాగ్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు నటించారు . ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం భరత్ సౌరభ్ అందించారు.
కథ
దుబాయ్‌లో విక్రమ్ (నాగార్జున) తన ప్రేయసి ప్రియ (సోనాల్ చౌహాన్)తో కలసి దుబాయ్‌లో పనిచేస్తుంటాడు. మాఫియాను మట్టుబెట్టే ఓ మిషన్‌లో జరిగిన ఓ సంఘటనకు మనస్తాపం చెందిన విక్రమ్.. తన ప్రియురాలు, ఉద్యోగానికి దూరంగా ఉంటాడు. మాఫియా కార్యక్రమాలను అడ్డుకొనే మిషన్స్‌లో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ ఉండే విక్రమ్‌కు అను (గుల్ పనాగ్) నుంచి ఫోన్ వస్తుంది. తాను, తన కూతురు అదితి (అనిఖా సురేంద్రన్) ఆపదలో ఉన్నామని అను చెబుతుంది. ఇంటర్‌పోల్‌లో ఉద్యోగానికి విక్రమ్ ఎందుకు రాజీనామా చేశాడు? లవర్ ప్రియకు విక్రమ్ ఎందుకు దూరంగా ఉన్నాడు? అనుకు విక్రమ్‌కు ఎలాంటి సంబంధం ఉంది? అదితికి ఎలాంటి ముప్పు ఎవరి నుంచి ఏర్పడింది? అను, అదితిని కాపాడటానికి విక్రమ్ ఎలాంటి రిస్క్ తీసుకొన్నారు? విక్రమ్‌కు ది ఘోస్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే ది ఘోస్ట్ సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie ది ఘోస్ట్ with us? Please send it to us ([email protected]).