X
తెలుగు » సినిమాలు » ది ఘోస్ట్‌
ది ఘోస్ట్‌

ది ఘోస్ట్‌

Action | 05 Oct 2022 | U/A | 140 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ది ఘోస్ట్‌ స్టోరీ

ది ఘోస్ట్‌ సినిమా ఫాంటసీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇందులో నాగార్జున, సోనాల్ చౌహన్, గల్ పనాగ్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు నటించారు . ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం భరత్ సౌరభ్ అందించారు.  కథ దుబాయ్‌లో విక్రమ్ (నాగార్జున) తన ప్రేయసి ప్రియ (సోనాల్ చౌహాన్)తో కలసి దుబాయ్‌లో పనిచేస్తుంటాడు. మాఫియాను మట్టుబెట్టే ఓ మిషన్‌లో జరిగిన ఓ సంఘటనకు మనస్తాపం చెందిన విక్రమ్.. తన ప్రియురాలు, ఉద్యోగానికి దూరంగా ఉంటాడు. మాఫియా కార్యక్రమాలను అడ్డుకొనే మిషన్స్‌లో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ ఉండే విక్రమ్‌కు అను (గుల్ పనాగ్) నుంచి ఫోన్ వస్తుంది. తాను, తన కూతురు అదితి (అనిఖా సురేంద్రన్) ఆపదలో ఉన్నామని అను చెబుతుంది.  ఇంటర్‌పోల్‌లో ఉద్యోగానికి విక్రమ్ ఎందుకు రాజీనామా చేశాడు? లవర్ ప్రియకు విక్రమ్ ఎందుకు దూరంగా ఉన్నాడు? అనుకు విక్రమ్‌కు ఎలాంటి సంబంధం ఉంది? అదితికి ఎలాంటి ముప్పు ఎవరి నుంచి ఏర్పడింది? అను, అదితిని కాపాడటానికి విక్రమ్ ఎలాంటి రిస్క్ తీసుకొన్నారు? విక్రమ్‌కు ది ఘోస్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే ది ఘోస్ట్ సినిమా కథ.
Read More

ది ఘోస్ట్‌ కాస్ట్ & క్రూ

ది ఘోస్ట్‌ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రవీణ్ సత్తారు
స్టోరీ ప్రవీణ్ సత్తారు
సినిమాటోగ్రఫీ మహేష్ జి
సంపాదకుడు NA
సంగీతం భరత్ సౌరభ్
నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్, శరత్ మరార్, పుస్కూర్ రామ్ మోహన్ రావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ది ఘోస్ట్‌ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలి, ఎమోషనల్ డ్రామాగా ది ఘోస్ట్ రూపొందింది. ఒక థ్రిల్లర్ కావాల్సిన అంశాలన్నీ చక్కగా కుదిరాయి. కానీ ఫ్యామిలీ డ్రామాను పూర్తిస్థాయి ఎమోషనల్‌గా డ్రామాగా రూపొందించి ఉంటే స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా మారి ఉండేదనిపిస్తుంది. బిజినెస్ డ్రామాను ఆసక్తికరంగా ప్రేక్షకుడికి కనెక్ట్ చేయలేకపోవడం ఈ సినిమాకు మైనస్. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే డెఫినెట్‌గా మంచి యాక్షన్ థ్రిల్లర్ అయి ఉండేది. ఈ సినిమా కమర్షియల్ స్టామినా బాక్సాఫీస్ వద్ద కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. యాక్షన్, థ్రిల్లర్ సినిమాను ఆదరించే వారికి ది ఘోస్ట్ నచ్చడానికి అవకాశం ఉంది.

ది ఘోస్ట్‌ ట్రైలర్

Video Thumbnail

ది ఘోస్ట్‌ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ది ఘోస్ట్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+