తెల్లవారితే గురువారం (2021)(U/A)
Release date
27 Mar 2021
genre
తెల్లవారితే గురువారం స్టోరి
తెల్లవారితే గురువారం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి సింహ కోడూరి, చిత్ర శుక్ల, మిష నారంగ్, సత్య అక్కల, వైవా హర్ష, రాజీవ్ కనకాల, అజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణికాంత్ జెల్లీ వహించారు. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని కలిసి నిర్మించారు. సంగీతం కాల భైరవ అందించారు.
కథ
వీరేంద్ర (శ్రీ సింహా)కు, మధు (మిషా నారంగ్)కి తెల్లవారితే పెళ్లి అనగా కుటుంబ సభ్యులు రిసెప్షన్ నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల బలవంతం మీద అయిష్టంతోనే పెళ్లికి ఒప్పుకొంటారు. అయితే చివరి నిమిషంలో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వీరేంద్ర, మధు పెళ్లి మంటపం నుంచి నుంచి పారిపోతారు. పెళ్లి జరిగే కొద్ది గంటలకు ముందు ఫంక్షన్ హాల్ నుంచి పారిపోయిన వారి జీవితంలో ఏం జరిగింది. మధును వీరేంద్ర పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తాడు? అలాగే వీరేంద్రతో పెళ్లికి ఎందుకు మధు వెనకడుగు వేస్తుంది? వీరేంద్ర, కృష్ణవేణి ప్రేమ కథ కు ముగింపు ఏమిటి? పెళ్లికి ముందు పారిపోయి వచ్చిన మధు పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే తెల్లవారితే గురువారం సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie తెల్లవారితే గురువారం with us? Please send it to us ([email protected]).