తిరు మూవీ కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుష్, రాశి ఖన్నా, నిత్య మీనన్, ప్రియా భవాని శంకర్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మిత్రన్ ఆర్ జవహర్ వహించారు. సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు.
కథ
తిరు అలియాస్ పండు (ధనుష్) ఫుడ్ డెలీవరీ యాప్‌లో పనిచేసే యువకుడు. పోలీస్ ఆఫీసరైన తండ్రి నీలకంఠం (ప్రకాశ్ రాజ్)ని ద్వేషిస్తుంటాడు. తాత సీనియర్ పండు (భారతీరాజా)తో చాలా చనువుగా ఉంటాడు. తన కాలనీలో ఉండే చిన్ననాటి స్నేహితురాలు శోభన (నిత్య మీనన్) అంటే చెప్పలేనంత ఇష్టం. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో తండ్రికి, తిరుకు భారీ గొడవ జరుగుతుంది. ఆ గొడవ తర్వాత హార్ట్ స్ట్రోక్‌తో పక్షవాతానికి గురి అవుతాడు. తండ్రిని తిరు ఎందుకు ద్వేషిస్తాడు? ఒకే ఇంట్లో ఉన్నా పదేళ్లుగా ఇద్దరు ఎందుకు మాట్లాడుకోరు. తండ్రి కొడుకుల మధ్య అగాథం ఏర్పడటానికి కారణం ఏమిటి? తండ్రితో గొడవ ఎందుకు జరిగింది? పక్షవాతానికి గురైన తండ్రి సంరక్షణ బాధ్యతను తిరు తన భుజాలపైకి ఎత్తుకొన్నాడా? తిరు జీవితంలో స్నేహితురాలు శోభన ఎలాంటి పాత్ర పోషించింది? తిరు ప్రేమను తన ప్రియురాలు అనూష (రాశీఖన్నా) ఎందుకు రిజెక్ట్ చేసింది. ఓ పెళ్లిలో మొదటి చూపులోనే ఇష్టపడిన రంజనీ (ప్రియా భవానీ శంకర్) తిరు ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది. తండ్రి కొడుకు, తాత మనవడు బంధానికి ముగింపు ఏమిటి? చివరికి తిరు ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే తిరు సినిమా కథ.