X
టక్ జగదీష్
Family | 10 Sep 2021 | U/A |
Telugu

టక్ జగదీష్ స్టోరీ

 టక్ జగదీష్ సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, రితు వర్మ, ఐశ్వర్య రాజేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శివ నిర్వన వహించారు. సహు గరపాటి, హరిష్ పెద్ది కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం తమన్ ఎస్ అందించారు .

భూదేవీపురం అనే గ్రామంలో ఎలాంటి భూ తగాదాలు లేని ఊరుగా చూడాలని కలలు కనే ఆదిశేష్ నాయుడు (నాజర్)కు బోసు బాబు (జగపతి బాబు), జగదీష్ నాయుడు అలియాస్ జగదీ అలియాస్ టక్ జగదీష్ (నాని) అనే కుమారులు ఉంటారు. ఆస్తి, డబ్బు పిచ్చితో బోసుబాబు ఉంటే.. ఉత్తమ విలువలతో నలుగురితో మంచి అనిపించుకొనాలనే లక్ష్యంతో టక్ జగదీష్ ఉంటాడు. ఆదిశేష్ నాయుడు చనిపోతూ ఇద్దరు భార్యల పిల్లలకు సమానంగా ఆస్థిలో వాటాలు పంచాలని బోసుబాబుకు చెబుతాడు. కానీ స్వార్ధంతో ఆస్తిని కాజేయాలని బోసుబాబు కుట్ర పన్నుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో టక్ జగదీష్ తన సొంతూరుకు ఎమ్మార్వోగా వస్తాడు. అయితే టక్ జగదీష్ అని జగదీష్ నాయుడుకి ఎందుకు ఆ పేరు వచ్చింది? తన సొంతూరు భూదేవీపురానికే ఎందుకు ఎమ్మార్వోగా టక్ జగదీష్ వచ్చాడు? స్వార్దపరుడైన తన అన్న బోసుబాబుకు కళ్లు ఎలా తెరిపించాడు. భర్త (తిరువీర్) పెట్టే గృహహింసను భరించలేని తన మేన కోడలు చంద్రమ్మ (ఐశ్వర్యరాజేశ్)ను ఎలా కాపాడాడు? తన ఇద్దరు అక్కలు కుమారక్క (రోహిణి), గంగ భవానీ (దేవదర్శిని)కి ఆస్తిని బోసుబాబు పంచేలా చేశాడు. భూ తగాదాలు లేని ఊరుగా భూదేవీపురాన్ని ఎలా మార్చాడు? గుమ్మడి వరలక్ష్మి (రితూ వర్మ) ఎలా పెళ్లి చేసుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే టక్ జగదీష్ సినిమా కథ.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+