ఊర్వశివో రాక్షసివో సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాకేష్ శశి వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మించారు.
కథ
శ్రీ కుమార్ (అల్లు శిరీష్) ఒక మధ్య తరగతి యువకుడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా జాబ్ చేస్తుంటాడు. అతని ఆఫీస్ కు ఎదురుగా ఉన్న మరో ఆఫీస్ లో పని చేసే సింధుజ (అను ఇమ్మాన్యుయేల్) అనే అమ్మాయిని దూరం నుంచే లవ్ చేస్తుంటాడు. ఆమెతో ఎలాగైన మాట్లాడుదామనుకున్న సమయంలో తన ఆఫీస్ లో చేరుతుంది సింధుజ. దీంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు తెగ కష్టపడుతుంటాడు శ్రీ కుమార్. అయితే సింధుజ మాత్రం అమెరికాలో పుట్టి పెరిగి వచ్చిన అమ్మాయి. పెళ్లి కన్నా గోల్, ఇండిపెండెంట్ గా ఉండాలనుకునే అమ్మాయి. మరి శ్రీ కుమార్ తో ప్రేమ, పెళ్లికి సింధుజ ఒప్పుకుందా? వాళ్లు ఇద్దరు కలిసి ఏం నిర్ణయం తీసుకున్నారు? తల్లిదండ్రుల కోసం శ్రీ కుమార్ ఏం చేశాడు? అసలు అతను ఎందుకు ఇల్లు వదిలిపారిపోయాడు? కెరీర్ ముఖ్యమనుకున్న సింధుజ చివరిగా ఏం చేసింది? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమా కచ్చితంగా చూడాల్సిందే.