"వి" సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, సుదీర్ బాబు, నివేద థామస్, అదితి రావు హైదరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ కృష్ణ ఇంద్రగంటి వహించారు మరియు దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం అమిత్ త్రివేది అందించారు.
కథ
డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) హైదరాబాద్‌లో పవర్‌ఫుల్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రచయితగా మారిన అపూర్వ అనే సైకాలజీ స్టూడెంట్‌తో ప్రేమలో పడుతాడు. జీవితం సాఫీగా సాగిపోతుందనుకొంటున్న సమయంలో ఊహించని విధంగా ఓ క్రిమినల్ (నాని) జీవితంలోకి ప్రవేశిస్తాడు. వరుస హత్యలు చేస్తూ ఆదిత్యకు సవాల్ విసురుతుంటాడు. ఐదు హత్యలు చేస్తానని సవాల్ విసిరి దమ్ముంటే అడ్డుకోమని ఛాలెంజ్ చేస్తాడు. V అని ఈ సినిమాకు ఎందుకు టైటిల్ పెట్టారు? ఆర్మీ ఆఫీసర్ (నాని) ఎందుకు క్రిమినల్‌గా మారాల్సి వచ్చింది? డీసీపీ అదిత్యనే టార్గెట్ చేసుకొని క్రిమినల్ (నాని) హత్యలు చేయడం మొదలుపెట్టారు? క్రిమినల్ ఐదుగురిని ఎందుకు హత్యలు చేయాలనుకొంటాడు? సూపర్ కాప్ ఆదిత్య తనకు ఎదురైన సమస్యను ఎలా పరిష్కరించాడు. పిల్లి ఎలుక చెలగాటంలా మారిన హత్యల దర్యాప్తు ఎలా సాగింది? అపూర్వ, ఆదిత్య ప్రేమ కథ ఎలా సాగింది? సాహోబా (అదితిరావు హైదరీ) పాత్ర ఎంటీ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.