వరుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రా, ఆర్య, ఆశిష్ విధ్యార్ధి, సుహాసిని, నరేష్, నాసర్, రావు రమేష్, శాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, సింగీతం శ్రీనివాస్, అనితా చౌదరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: గుణశేఖర్ నిర్వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
మంచి కుటుంబలో పుట్టి పెరిగిన సందీప్ (అల్లు అర్జున్) పైకి ఆధునికంగా కనిపించినా సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూంటాడు.రేపో మాపో అమెరికా వెళ్ళిపోదామనుకుంటున్న అతనికి పెళ్ళి చేద్దామని అతని తల్లి(సుహాసిని), తండ్రి(ఆశిష్ విధ్యార్ధి) నిర్ణయించుకుని ఏమన్నా ప్రేమ వ్యవహారం ఉందా అని అడుగుతాడు. కానీ బుద్ది మంతుడైన సందీప్ అలాంటిదేమీ లేదని ఎరేంజ్ మ్యారేజ్ చెయ్యమంటాడు. అయితే ఐదు రోజులు పాటు పెళ్ళి గ్రాండ్ గా చేయాలని, పెళ్ళి కూతురుని పీటల మీదే చూస్తానని కండీషన్ పెడతాడు. సరేనన్న అతని తల్లి తండ్రులు ఓ అమ్మాయి(భానుశ్రీ మెహ్రా) తో వివాహం నిర్ణయిస్తారు. పెళ్ళి పీటల మీద తొలిసారిగా చూసిన వరుడు సందీప్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలబడదు. ఆ పెళ్ళి మండపం కూలగొట్టి దివాకర్ (ఆర్య). అనే విలన్ ఎంట్రీ ఇచ్చి వధువుని ఎత్తుకుపోతాడు. ఆ తర్వాత వరుడు ఆమెను ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకుని పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కథ.