X
వరుడు

వరుడు

Action | Romance | 31 Mar 2010 | U/A |
Telugu

2.9 /5 Users

1 /5 Filmibeat

వరుడు స్టోరీ

వరుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రా, ఆర్య , ఆశిష్ విధ్యార్ధి, సుహాసిని, నరేష్, నాసర్, రావు రమేష్, శాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, సింగీతం శ్రీనివాస్, అనితా చౌదరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: గుణశేఖర్ నిర్వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు. కథ మంచి కుటుంబలో పుట్టి పెరిగిన సందీప్ (అల్లు అర్జున్) పైకి ఆధునికంగా కనిపించినా సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూంటాడు.రేపో మాపో అమెరికా వెళ్ళిపోదామనుకుంటున్న అతనికి పెళ్ళి చేద్దామని అతని తల్లి(సుహాసిని), తండ్రి(ఆశిష్ విధ్యార్ధి) నిర్ణయించుకుని ఏమన్నా ప్రేమ వ్యవహారం ఉందా అని అడుగుతాడు. కానీ బుద్ది మంతుడైన సందీప్ అలాంటిదేమీ లేదని ఎరేంజ్ మ్యారేజ్ చెయ్యమంటాడు. అయితే ఐదు రోజులు పాటు పెళ్ళి గ్రాండ్ గా చేయాలని, పెళ్ళి కూతురుని పీటల మీదే చూస్తానని కండీషన్ పెడతాడు. సరేనన్న అతని తల్లి తండ్రులు ఓ అమ్మాయి(భానుశ్రీ మెహ్రా) తో వివాహం నిర్ణయిస్తారు. పెళ్ళి పీటల మీద తొలిసారిగా చూసిన వరుడు సందీప్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలబడదు. ఆ పెళ్ళి మండపం కూలగొట్టి దివాకర్‌ (ఆర్య). అనే విలన్ ఎంట్రీ ఇచ్చి వధువుని ఎత్తుకుపోతాడు. ఆ తర్వాత వరుడు ఆమెను ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకుని పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కథ.
Read More

వరుడు కాస్ట్ & క్రూ

వరుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం గుణశేఖర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత డి వి వి దానయ్య
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వరుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హీరోయిన్ ని విలన్ ఎత్తుకుపోవటం, దాంతో హీరో రెచ్చిపోయి...విలన్ ని తుక్కు చేసి ఆమెను రక్షించేయటం లాంటి ఒక్కడు నాటి కాన్సెప్ట్ తోనే వరుడు వచ్చాడు. అయితే ఈ సారి ఐదు రోజుల పెళ్ళి, పదహారు రోజులు పండుగ అని కొద్దిగా బిల్డప్ ఇచ్చి కొత్త కథ అని నమ్మించబోయి తానే బోల్తా పడ్డాడు.అలాగే కథ,కథనంలు లోపంగా వచ్చిన ఈ వరుడులో హీరోయిన్ ని మిస్టీరియస్ గా ఉంచి ఆసక్తి రేపాలని ప్రయత్నం చేసారు. అయితే ఆమె కూడా ఊహించనంత గొప్పగా లేకపోవటంతో అదీ తుస్సుమంది. అయితే అల్లు అర్జన్, ఆర్య నటనలు మాత్రం ఈ సినిమాలో పోటీపోటీగా కనిపించటం విశేషం. ఇక ఐదు రోజుల పెళ్ళి అనే పాయింటు తో వచ్చిన ఈ చిత్రం ఐదు రోజులైనా సక్సెస్ ఫుల్ గా నడుస్తుందా అంటే సందేహమే.

వరుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.9 /5 Your Rating

వరుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+