వీర సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, కాజల్ అగర్వాల్, తాప్సీ, కిక్ శ్యామ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత గణేష్ ఇందుకూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ ఎస్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఆపదలో ఉన్న ఏ.సి.పి శ్యామ్ (కిక్ శ్యామ్)ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్ గా దేవా(రవితేజ)వస్తాడు.వచ్చిందే తడువుగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో అనుబంధం పెనవేసుకోవటానికి విపరీతంగా ట్రై చేస్తూంటాడు.అయితే ఏ.సి.పి భార్య సత్య(శ్రీదేవి)మాత్రం దేవాని అనుమానంగా చూస్తూ అవమానం చేస్తూంటుంది.హీరో కాబట్టి తప్పదన్నట్లు అవన్నీ భరిస్తూ,మధ్య మధ్యలో ఆ కుటుంబాన్ని విలన్స్ నుంచి కాపాడేస్తూ,పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ,హీరోయిన్ తో పాటలు పాడుతూ గడిపేస్తూంటాడు.ఇదిలా ఉంటే ప్రదీప్ రావత్ అనే విలన్ ఎసిపి భార్య ఫోటొ పట్టుకుని అందరినీ ఆమె గురించి అడుగుతూ సిటీలో తిరుగుతూంటాడు.ఈలోగా అనుకోని విధంగా ఎసిపి కీ తమ ఇంట్లో ఉన్నది దేవా కాదని వీర అనే చాలా గొప్ప వ్యక్తి అని రివిల్ అవుతుంది.ఇంతకీ వీరా ఎవరు...అస్సలు అతనకీ ఈ ఇంటికీ సంభందం ఏమిటి..ఏసిపీ భార్య అతన్ని ఎందుకు దూరం పెడుతోంది వంటి ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే సినిమా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ చూడాల్సిందే.