వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్‌కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, బ్రహ్మాజీ, నాగినీడు, పృథ్వీ, తాగుబోతు రమేశ్, సప్తగిరి, కమల్, ప్రవీణ్, నిఖిల్, నర్సింగ్ యాదవ్, మీనా, సంధ్య తదితరులు తదిరులు నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ నిర్వహించారు మరియు నిర్మాత కిరణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రమణ గోగుల స్వరాలు సమకుర్చారు.
కథ
అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమయ్యే ఈ చిత్రంలో సందీప్ (సందీప్ కిషన్) సగటు తెలుగు సినీ హీరోలా తన కళ్లెదురుగాఅన్యాయం జరుగుతూంటే సహించలేడు. అయినదానికీ,కానిదానికి ప్రతీ విషయంలో తలదూర్చే అతనంటే తండ్రి రామ్మూర్తి(నాగినీడు)కి నచ్చదు. ఆయన శిశుపాలుడిలా వంద తప్పుల వరకే పరిమితి ఇచ్చారు. ఆల్రెడీ సందీప్ తొంభై తొమ్మిది తప్పులు చేసేశాడు. మిగిలిన ఒక్క తప్పు చేయకుండా ఎలా తప్పించుకోవాలి అనుకున్న సమయంలో అతను తన సోదరుడు (బ్రహ్మాజీ) పెళ్లికి తిరుపతి కి సకుటుంబ సమేతంగా బయిలు దేరతాడు.
ఆ ప్రయాణంలో అతనికి వందవ తప్పు చేయాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. ఈ ప్రయాణంలోనే ప్రార్థన (రకుల్ ప్రీత్‌సింగ్) పరిచయమవుతుంది. ఆమె చాలా ప్రాక్టికల్ ...లెక్కల మనిషి. ఇద్దరి గమ్యం ఒక్కటే. తిరుపతి వెళ్లాలి. కానీ కారణాలు వేరు. ఈ రైలు ప్రయాణం అతని జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది? 100 వ తప్పు చేయకుండా తప్పించుకున్నాడా..ఏం తిప్పలు పడ్డాడు అనేదే ఈ చిత్ర కథ.