X
తెలుగు » సినిమాలు » విడుదల పార్ట్‌-1
విడుదల పార్ట్‌-1

విడుదల పార్ట్‌-1

Adult | 15 Apr 2023 | A | 150 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

విడుదల పార్ట్‌-1 స్టోరీ

విడుదల పార్ట్‌-1 మూవీ యాక్షన్, క్రైమ్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూరి, విజయ్ సేతుపతి, భవాని శ్రీ, ఇళవరసు, చేతన్ కె తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెట్రిమారన్ వహించారు. నిర్మాత ఎలర్డ్ కుమార్ నిర్మించారు. సంగీతం ఇళయరాజా అందించారు.  కథ కుమరేషన్ అనే గ్రామీణ ప్రాంత యువకుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ క్యాంపులో డ్రైవర్‌గా చేరుతాడు. నిజాయితీ, ముక్కుసూటితనం వల్ల ఉన్నత అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. క్షమాపణ చెబితే తిప్పలు పెట్టమని చెబితే.. తప్పు చేయనప్పుడు సారీ చెప్పనని మొండికేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో తమిళసై (భవానీ శ్రీ) అనే గ్రామీణ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ సమయంలోనే పెరుమాల్ అలియాస్ వాతియార్ అనే తీవ్రవాద నాయకుడు (విజయ్ సేతుపతి) ఆచూకీ కోసం తమిళసైతోపాటు మరికొందరు మహిళలను నగ్నంగా నిలబెట్టి పోలీసులు హింసిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో పెరుమాల్ ఆచూకీ తనకు తెలుసని, కొంత మంది సిబ్బందిని ఇస్తే తాను పట్టుకొంటానని ఉన్నతాధికారి మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్)‌ను కోరడంతో అందుకు సదరు అధికారి సమ్మతించి కుమరేషన్‌కు అధికారాలిస్తాడు. కుమరేషన్‌కు పై అధికారులతో విభేదాలకు కారణం ఏమిటి? నిజాయితీ, నిబద్దతతో ఉద్యోగం చేసే కుమరేషన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ప్రేయసితో కుమరేషన్ ప్రేమ ఎలా సాగింది? పెరుమాల్‌ను పట్టుకోవడానికి గ్రామస్థులను పోలీసులు హింసించారు? పెరుమాల్‌ను పట్టుకోవడానికి కుమరేషన్ ఎలాంటి ప్రయత్నం చేశాడు? పెరుమాల్‌ను కుమరేషన్ ఎందుకు పట్టించాలని అనుకొన్నాడు? ఇంతకు పెరుమాల్‌ను కుమరేషన్ పట్టించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే విడుదల సినిమా ట్రైలర్   అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీస్ వారికి మధ్య నడిచే పోరాటంగా ఈ కథ తెరకెక్కినట్లు కనిపిస్తుంది. గిరిజనులకు అండగా విజయ్‌ సేతుపతి పెరుమాళ్‌గా కీలకపాత్ర పోషిస్తుండగా, సూరి కానిస్టేబుల్‌ పాత్ర పోషిస్తున్నాడు. పోలీసులకు సమస్యగా మారిన పెరుమాళ్‌ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు గిరిజనులను హింసిస్తుంటారు. అప్పుడు పెరుమాళ్ పోలీసులను ఎలా అడ్డుకుంటాడు? పెరుమాళ్‌ను పట్టుకునేందుకు సూరి తన పై అధికారులకు ఎలాంటి సహాయం చేశాడు అనే అంశాలను ట్రైలర్‌ వుంది 
Read More

విడుదల పార్ట్‌-1 కాస్ట్ & క్రూ

విడుదల పార్ట్‌-1 సిబ్బంది సమాచారం

దర్శకత్వం వెట్రిమరణ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇళయరాజా
నిర్మాత ఎలర్డ్ కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

విడుదల పార్ట్‌-1 విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సినిమా తెర మీద తీవ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కథలు ఎన్నో వచ్చాయి. ఒక్కో సినిమా ఒక్కో కోణంలో కథను చెప్పాయి. అయితే ఈ సినిమాలో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉండే వివక్షను చక్కగా చూపించాయి. ప్రతీ రంగంలోను కింది ఉద్యోగులపై పైఉద్యోగుల అధిపత్య ధోరణి, వివక్ష ఉండటం సహజం.. ఇందుకు పోలీస్ రంగం మినహాయింపు కాదని దర్శకుడు చెప్పిన తీరు బాగుంది. కథకు తగినట్టుగా పాత్రల డిజైన్ బాగుంది. సినిమా చూసినంత సేపు ఓ భావోద్వేగం, కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సినిమా కాస్త స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ కథ డిమాండ్ చేయడం వల్లే అలాంటి స్క్రీన్ ప్లే అనుసరించారనే విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్. నక్సల్స్, పోలీసుల మధ్య ఎన్‌కౌంటర్లు, గ్రామీణ నేటివిటితో వచ్చే సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమా తప్పకుండా నచ్చే అంశాలు ఉన్నాయి.

విడుదల పార్ట్‌-1 ట్రైలర్

Video Thumbnail

విడుదల పార్ట్‌-1 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

విడుదల పార్ట్‌-1

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+