CelebsbredcrumbMahesh Babu
  మహేష్ బాబు

  మహేష్ బాబు

  Actor/Producer
  Born : 09 Aug 1975
  Birth Place : హైదిరాబాద్, తెలంగాణ
  మహేష్ బాబు  తెలుగు సిని నటుడు అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుసుకుంటారు. మహెష్ ని తెలుగు సినిమా సూపర్ స్టార్ అని కూడ అంటారు. మహెష్ బాబు 9 aug 1974 సూపర్ స్టార్ కృష్ణ కు  శ్రీమతి ఇందిరా దేవి  గారికి మద్రాసు లొ జర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ... ReadMore
  Famous For
  మహేష్ బాబు తెలుగు సిని నటుడు అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుసుకుంటారు. మహెష్ ని తెలుగు సినిమా సూపర్ స్టార్ అని కూడ అంటారు. మహెష్ బాబు 9 aug 1974 సూపర్ స్టార్ కృష్ణ కు  శ్రీమతి ఇందిరా దేవి  గారికి మద్రాసు లొ జర్మించారు.


  సూపర్ స్టార్ కృష్ణ  నటవారసునిగా వెండితెరకు పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు జననం మద్రాసు లో జరిగింది. మహేష్ చదువు మద్రాసు లో పూర్తిచేసారు. ప్రాధమిక విద్య సెయింట్ బెడె స్కూల్ లో కొనసాగించగా, లయోలా కాలేజీ నుండి కామర్స్ లో పట్టా పుచ్చుకున్నాడు. చిన్న తనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ 5 సంవత్సరాల వయసులోనే నీడ(1979)చిత్రంతో  తెరంగేట్రం  చేసాడు. బాల్యనటుడిగా తన తండ్రితోపాటు 7 చిత్రాలకు...
  Read More
  • SSMB28 - Filming Begins
  • కళావతి వీడియో సాంగ్- సర్కారు వారి పాట
  • మేజర్ మూవీ ట్రైలర్
  • మా మా మహేశా లిరికల్ వీడియో - సర్కారు వారి పాట
  • సర్కారు వారి పాట మూవీ ట్రైలర్
  • సర్కారు వారి పాట మూవీ టైటిల్ సాంగ్
  • 1
   కృష్ణ వారసుడిగా వెండితెరకు పరిచయమైన తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ కంటే ఓ మెట్టు ఎక్కువే ఎదిగారు.
  • 2
   స్టైల్, హ్యాండ్ సమ్ నెస్, యాక్టింగ్ తిరుగులేని స్టార్ గా నిలబెట్టాయి. ఇక సామాజిక సేవతో రియల్ హీరోలు అనిపించుకున్నారు.
  • 3
   ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు, వేయి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించారు.
  • 4
   మహేష్ ఓ మంచి హస్బెండ్, ఫాదర్. సూపర్ స్టార్ గా క్షణం తీరిక లేకుండా గడిపే మహేష్ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. తన బిజీ షెడ్యూల్స్ లో కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
  • 5
   రిజర్వుడుగా ఉండే మహేష్.. హీరోయిన్ నమ్రతను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అనూహ్య పరిణామం.
  • 6
   హీరోగా మహేష్ మూడవ చిత్రం వంశీ. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఈ మూవీ హీరోయిన్ గా నమ్రత శిరోద్కర్ ని ఎంచుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వంశీ షూటింగ్ సమయంలో మహేష్-నమ్రత మధ్య ప్రేమ చిగురించింది.
  • 7
   వంశీ మూవీ 2000లో విడుదల కాగా... ఐదేళ్లు మహేష్-నమ్రత రహస్యంగా ప్రేమించుకున్నారు. వీరి గురించి ఎలాంటి ఎఫైర్ రూమర్స్ బయటికి రాకపోవడం విశేషం. 2005 ఫిబ్రవరి 10న అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగింది
  • 8
   మహేష్ కోసం తన కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది నమ్రత. ఓ సాధారణ గృహిణిగా మారి గొప్ప ఇల్లాలుగా పేరు తెచ్చుకున్నారు. మహేష్, నమ్రత అంత ఆదర్శ దంపతులు వేరొకరు ఉండరేమో... కాగా మహేష్ కంటే నమ్రత వయసులో పెద్దది కావడం విశేషం.
  • 9

   మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎందరికో జీవితాలని ఇచ్చాడు, ఇస్తున్నాడు. ఆయన చేసే కొన్ని సేవా కార్యక్రమాలు..
  • 10
   2016లో ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
  • 11
   మహేష్ చేసే ముఖ్యమైన సేవా కార్యక్రమం చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్. ఇప్పటివరకు దాదాపు గుండె సంబంధిత సమస్యలు ఉన్న 1000 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు. ఆ పిల్లల తల్లిదండ్రులు మహేష్ ని దేవుడిగా చూస్తారు.
  • 12
   గుండె సమస్య ఉన్న చిన్న పిల్లలు ఎంతమంది వచ్చినా తన సొంత ఖర్చులతో హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తానని ప్రకటించారు.
  • 13
   అంతేకాక ఆ గ్రామాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు.
  • 14
   తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలోని ప్రజలకు తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రీ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు. ఇలా స్పెషల్ డేస్ లో ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తారు మహేష్.
  • 15
   అంతేకాక తన దగ్గర పని చేసేవాళ్ళ పిల్లల చదువులకి కూడా మహేష్ అవసరమైన సహాయాన్ని చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ దగ్గర పనిచేస్తున్న వారే చెప్పారు.
  • 16
   పోకిరి, దూకుడు,శ్రీమంతుడు సినిమాలతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు.
  • 17
   మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్ చేయడానికి ప్రస్తుతం 15 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
  • 18
   ప్రస్తుతం మహేష్ బాబు ఇమేజ్ నేషనల్ వైడ్ గా పెరిగిపోయింది. ఇక అందుకు తగ్గట్టుగానే మహేష్ కూడా బడా కంపెనీలతో డీల్స్ సెట్ చేసుకుంటున్నాడు.
  • 19
   మహేష్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపు 50 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం.
  మహేష్ బాబు వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X