X
విడుదల పార్ట్‌-1
Adult | 15 Apr 2023 | A | 150 Mins
Telugu

విడుదల పార్ట్‌-1 స్టోరీ

విడుదల పార్ట్‌-1 మూవీ యాక్షన్, క్రైమ్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూరి, విజయ్ సేతుపతి, భవాని శ్రీ, ఇళవరసు, చేతన్ కె తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెట్రిమారన్ వహించారు. నిర్మాత ఎలర్డ్ కుమార్ నిర్మించారు. సంగీతం ఇళయరాజా అందించారు. 

కథ

కుమరేషన్ అనే గ్రామీణ ప్రాంత యువకుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ క్యాంపులో డ్రైవర్‌గా చేరుతాడు. నిజాయితీ, ముక్కుసూటితనం వల్ల ఉన్నత అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. క్షమాపణ చెబితే తిప్పలు పెట్టమని చెబితే.. తప్పు చేయనప్పుడు సారీ చెప్పనని మొండికేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో తమిళసై (భవానీ శ్రీ) అనే గ్రామీణ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ సమయంలోనే పెరుమాల్ అలియాస్ వాతియార్ అనే తీవ్రవాద నాయకుడు (విజయ్ సేతుపతి) ఆచూకీ కోసం తమిళసైతోపాటు మరికొందరు మహిళలను నగ్నంగా నిలబెట్టి పోలీసులు హింసిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో పెరుమాల్ ఆచూకీ తనకు తెలుసని, కొంత మంది సిబ్బందిని ఇస్తే తాను పట్టుకొంటానని ఉన్నతాధికారి మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్)‌ను కోరడంతో అందుకు సదరు అధికారి సమ్మతించి కుమరేషన్‌కు అధికారాలిస్తాడు. కుమరేషన్‌కు పై అధికారులతో విభేదాలకు కారణం ఏమిటి? నిజాయితీ, నిబద్దతతో ఉద్యోగం చేసే కుమరేషన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ప్రేయసితో కుమరేషన్ ప్రేమ ఎలా సాగింది? పెరుమాల్‌ను పట్టుకోవడానికి గ్రామస్థులను పోలీసులు హింసించారు? పెరుమాల్‌ను పట్టుకోవడానికి కుమరేషన్ ఎలాంటి ప్రయత్నం చేశాడు? పెరుమాల్‌ను కుమరేషన్ ఎందుకు పట్టించాలని అనుకొన్నాడు? ఇంతకు పెరుమాల్‌ను కుమరేషన్ పట్టించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే విడుదల సినిమా

ట్రైలర్ 
అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీస్ వారికి మధ్య నడిచే పోరాటంగా ఈ కథ తెరకెక్కినట్లు కనిపిస్తుంది. గిరిజనులకు అండగా విజయ్‌ సేతుపతి పెరుమాళ్‌గా కీలకపాత్ర పోషిస్తుండగా, సూరి కానిస్టేబుల్‌ పాత్ర పోషిస్తున్నాడు. పోలీసులకు సమస్యగా మారిన పెరుమాళ్‌ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు గిరిజనులను హింసిస్తుంటారు. అప్పుడు పెరుమాళ్ పోలీసులను ఎలా అడ్డుకుంటాడు? పెరుమాళ్‌ను పట్టుకునేందుకు సూరి తన పై అధికారులకు ఎలాంటి సహాయం చేశాడు అనే అంశాలను ట్రైలర్‌ వుంది 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+