వర్జిన్ స్టోరి సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు నటించారు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం: ప్రదీప్ బి అట్లూరి వహించారు. నిర్మాతలు: లగడపాటి శిరీష శ్రీధర్, నిర్మించారు. సంగీతం అచు రాజమణి అందించారు.
కథ
ప్రియాంషి (సౌమికా పాండ్యన్) అనే గొప్పింటి అమ్మాయికి తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ జరుగుతుంది. తన బాయ్‌ఫ్రెండ్ చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకొనే క్రమంలో ఓ పబ్‌లో కనిపించిన విక్రమ్ (విక్రమ్ సహిదేవ్)కు క్లోజ్ అవుతుంది. అయితే వారిద్దరు శారీరకంగా కలిసి తొలి అనుభవంలోని అనుభూతిని పొందాలనుకొంటారు. ప్రియాంషికి తన బాయ్‌ఫ్రెండ్ ఎలాంటి మోసం చేశాడు? తన బాయ్‌ఫ్రెండ్‌కు బుద్ది చెప్పడానికి ప్రియాంషి ఏం ప్లాన్ వేసింది? విక్రమ్‌నే ప్రియాంషి ఎందుకు ఎంచుకొన్నది? తొలిరాత్రి అనుభవాన్ని తీర్చుకొనే క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఏమిటి? సెక్స్‌ను ఎంజాయ్ చేయాలని అనుకొన్న విక్రమ్, ప్రియాంషిల లక్ష్యం నెరవేరిందా అనే ప్రశ్నలకు సమాధానమే వర్జిన్ స్టోరి సినిమా.